ఆర్ కె ఫిలిమ్స్ పతాకంపై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాతగా, బ్యూటీ క్వీన్ లక్మీ రాయ్ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో తమిళంలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన “ఝాన్సీ ఐపీఎస్” చిత్రం ఈనెల 29న తెలుగులో గ్రాండ్ గా విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో భారీ స్థాయిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు నిర్మాత ఆర్.కె. గౌడ్. తాజాగా “ఝాన్సీ ఐపీఎస్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
నిర్మాత ఎ గురురాజ్ మాట్లాడుతూ – “ఝాన్సీ ఐపీఎస్” సినిమా కంటెంట్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రంలో లక్ష్మీ రాయ్ యాక్షన్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం మంచి ఆదరణ పొంది నిర్మాతగా రామకృష్ణ గౌడ్ గారికి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా అన్నారు.
చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… కర్తవ్యం వంటి లేడీ ఓరియెంటెడ్ పోలీస్ స్టోరీతో ఘన విజయాన్ని అందుకున్న నిర్మాత ఏఎం రత్నం గారు ఈ రోజు మా “ఝాన్సీ ఐపీఎస్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎన్నో ఘన విజయాలు సాధించాయి. అలాంటి ప్రయత్నమే మా సంస్థ ద్వారా “ఝాన్సీ ఐపీఎస్”తో చేస్తున్నాం. ఈ చిత్రంలో లక్మీ రాయ్ త్రిపాత్రాభినయం చేశారు. భూ కబ్జాలు చేసి బిల్డింగ్స్ కట్టిన వారి భవనాలు కూల్చే ఐపీఎస్ ఆఫీసర్ గా లక్ష్మీరాయ్ కనిపిస్తారు. ఆమె పాత్ర చూస్తే ఇప్పటి హైడ్రా గుర్తుకు వస్తుంది. అలాగే గ్లామరస్ గా ఉండే మరో క్యారెక్టర్ తో పాటు డ్రగ్స్ ముఠాను వేటాడే పాత్రలో ఆమె నటించారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు 8 ఫైట్స్ కంపోజ్ చేశారు. ఈ సినిమా తర్వాత మహిళా కబడ్డీ జట్టు అనే మూవీ చేస్తున్నాం. ఢీ విన్నర్ అక్సా ఖాన్ ఆ సినిమాలో నటిస్తారు. ఈ నెల 29న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు మా మూవీని తీసుకొస్తున్నాం. మీ సపోర్ట్ ఇలాగే ఉంటుందని కోరుకుంటున్నా అన్నారు.
టీ మా ప్రెసిడెంట్ రశ్మి ఠాకూర్ మాట్లాడుతూ- “ఝాన్సీ ఐపీఎస్” సినిమా తమిళం, మలయాళంలో ఇప్పటికే పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు తెలుగులోకి రామకృష్ణ గౌడ్ గారు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే యాక్షన్ తో పాటు మంచి గ్లామర్ ఉంటుందని తెలుస్తోంది. “ఝాన్సీ ఐపీఎస్” సినిమా తప్పకుండా విజయవంతం కావాలి, మీరంతా థియేటర్స్ లో ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నా అన్నారు.
నటి అక్సాఖాన్ మాట్లాడుతూ- “ఝాన్సీ ఐపీఎస్” సినిమా ట్రైలర్ కు నేను బాగా కనెక్ట్ అయ్యాను. నేను డ్యాన్సర్, జిమ్నాస్ట్ ను. నేను కోరుకునే ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. ఈ నెల 29న ఈ చిత్రాన్ని థియేటర్స్ లో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి చూడండి. తమిళం, మలయాళం కంటే తెలుగులో “ఝాన్సీ ఐపీఎస్” పెద్ద సక్సెస్ కావాలి అన్నారు.
నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ- సినిమాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి. నా కర్తవ్యం మూవీ చూసి చాలామంది అమ్మాయిలు పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి వచ్చేందుకు ఆసక్తి చూపించారు. అలాగే భారతీయుడు మూవీ చూసి కొందరు ఉద్యోగులు లంచాలు తీసుకోవద్దనే నిర్ణయానికి వచ్చారు. బాయ్స్ సినిమా చూసి ఇంట్లోంచి బయటకు వచ్చి సినిమాల కోసం ప్రయత్నించానని కేజీఎఫ్ హీరో యష్ నాతో చెప్పారు. అలా సినిమా మాధ్యమం ఎంతోమందికి స్ఫూర్తిని అందిస్తుంది. “ఝాన్సీ ఐపీఎస్” ట్రైలర్ చూశాను చాలా బాగుంది. లక్ష్మీరాయ్ యాక్షన్ బాగా చేయగలదు. ఈ సినిమాతో రామకృష్ణ గౌడ్ గారికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నా అన్నారు.
నటుడు సుమన్ మాట్లాడుతూ – రత్నం గారు ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు. అప్పట్లో మేము చేసిన మూవీస్ చూసి యూత్ ఇన్స్ పైర్ అయ్యేవాళ్లు. కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేవాళ్లు. ఇప్పుడు మహిళలు మరింతగా పోలీస్ డిపార్ట్ మెంట్ లోకి రావాల్సిన అవసరం ఉంది. “ఝాన్సీ ఐపీఎస్” సినిమా ఆ స్ఫూర్తిని ప్రేక్షకుల్లో కలిగిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే రామకృష్ణ గౌడ్ గారికి ఈ సినిమా మంచి పేరు, డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో స్నిగ్ధా రెడ్డి, మౌనిక రెడ్డి, రవి, అల్లభక్షు, డి ఏస్ రెడ్డి, దుబాయ్ ప్రసాద్, కిషోర్ తేజ, కొఠారి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.
Grand “Jhansi IPS” Pre-Release Event, Theatrical Release on November 29th
Under the banner of RK Films, produced by Prathani Ramakrishna Goud, and directed by Guruprasad, the Tamil blockbuster “Jhansi IPS” is set to release in Telugu on November 29 in a grand manner. The producers have planned an extensive release across numerous theaters. The pre-release event of “Jhansi IPS” was recently held at Prasad Labs, Hyderabad, in a grand fashion, with prominent producer A.M. Ratnam gracing the occasion as the chief guest.
Producer E. Gururaj said “Jhansi IPS” is packed with powerful content. Lakshmi Rai’s action sequences will undoubtedly captivate audiences. I hope the film receives great appreciation and brings success to producer Ramakrishna Goud.”
Film Producer Dr. Prathani Ramakrishna Goud shared:
“It’s an honor to have A.M. Ratnam, known for delivering successful women-centric police stories like Kartavyam, as our chief guest. Women-centric films have consistently garnered immense success, and with ‘Jhansi IPS’, we aim to replicate that. Lakshmi Rai has played three distinct roles in this film. She portrays an IPS officer who demolishes illegally constructed buildings, a glamorous character, and a determined officer chasing drug cartels. Her role reminds us of the spirit of Hyderabadi IPS officers. Action master Thriller Manju has choreographed eight gripping fight sequences. After this, we are working on another movie about a women’s Kabaddi team. Our film is releasing grandly on November 29, and we hope to have your continued support.”
Team President Rashmi Thakur said..
“Jhansi IPS” has already been a massive success in Tamil and Malayalam. Now, producer Ramakrishna Goud is bringing it to Telugu. The trailer promises a blend of action and glamour. I wish for the film’s success and encourage everyone to watch it in theaters.”
Actress Aksa Khan said..”I felt deeply connected to the ‘Jhansi IPS’ trailer. As a dancer and gymnast, I look for specific elements in a movie, and this film delivers them. I urge everyone to watch the movie in theaters with friends and family on November 29. I hope it achieves greater success in Telugu than in Tamil or Malayalam.”
Producer A.M. Ratnam remarked:
“Movies can inspire many. After Kartavyam, many girls showed interest in joining the police department. Similarly, Indian inspired people to reject corruption, and Boys motivated individuals to pursue their dreams. ‘Jhansi IPS’ will inspire many as well. I watched the trailer, and it’s excellent. Lakshmi Rai has excelled in action sequences. I wish Ramakrishna Goud great success with this film.”
Actor Suman said..
“Ratnam Garu has produced numerous iconic films. Movies from that era inspired youth to learn martial arts and karate. Now, it’s essential for more women to join the police force. ‘Jhansi IPS’ will instill this inspiration in audiences. I wish Ramakrishna Goud both fame and financial success with this movie.” Snikdha Reddy, Mounika Reddy, Ravi, Allabakshu, D.S. Reddy, Dubai Prasad, Kishore Teja, Kothari Agarwal, and others participated in this program.