• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

మహిళా-శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష

admin by admin
August 2, 2024
in politics
0 0
0
ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అమరావతి:- ప‌థ‌కాలు అందించ‌డ‌మే కాదు.. వాటి ద్వారా అత్యుత్తమ ఫ‌లితాలు సాధించే విధంగా ప్రణాళికతో ప‌నిచేయాల‌ని మ‌హిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల‌కు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు సూచించారు. స‌చివాల‌యంలో మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌పై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష చేశారు. మహిళలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగ‌న్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్ష‌న్ కార్య‌క్ర‌మాల‌పై అధికారుల‌తో సీఎం స‌మీక్షించారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై సమీక్ష చేశారు. 2014లో ప్రవేశపెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని వంటి పథకాల స్థితిగతులను తెలుసుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 55,607 అంగ‌న్వాడీ కేంద్రాలు ఉన్నాయని…అందులో ప్రధాన అంగ‌న్వాడీ కేంద్రాలు 48770 ఉండగా, మినీ అంగన్వాడీలు 6,837 ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇందులో గిరిజన ప్రాంతాల్లో 8,311 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 12,496 కేంద్రాలను నిర్మించాలనే లక్ష్యంతో పనులు మొదలుపెట్టగా 2019 నాటికి అందులో 6,119 నిర్మాణాలు పూర్తి అయ్యాయిని, మరో 2800 నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే గత ఐదు ఏళ్లలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణంపై దృష్టి పెట్టలేదని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం కొత్తగా 2,048 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసి కేవలం 18 కేంద్రాలను మాత్రమే పూర్తి చేసిందని అధికారులు వివరించారు. అంగన్వాడీల అప్ గ్రెడేష‌న్లో కూడా పురోగ‌తి లేదని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 14,597 అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవు అని, 8,455 సెంటర్లలో విద్యుత్తు సదుపాయం లేదని సీఎంకు అధికారులు సమీక్షలో వివరించారు. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక‌ సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్రంలో వీలైనన్ని ఉమెన్ హాస్టళ్లు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో మంచి ఫలితాలు సాధించేలా సరికొత్త ఆలోచనలతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏడాదిలోనే ఫలితాలు సాధించే లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం పనిచేయాలని సూచించారు. పథకాలు అందించడమే కాదని…వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలన్నారు. ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమగ్ర ప్రణాళిక, సమూల మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్య రావ్ హార్ట్ టచ్చింగ్ మూవీ ‘డియర్ నాన్న’ ఆగస్ట్ 1 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్

Next Post

గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘తెప్ప సముద్రం’ ఆగస్ట్ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Next Post
గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘తెప్ప సముద్రం’ ఆగస్ట్ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్

గ్రిప్పింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'తెప్ప సముద్రం' ఆగస్ట్ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?
politics

ఏపీలో గవర్నర్ కోటా MLC పదవి బీజేపీకి కూడా కేటాయించారా?

by admin
August 19, 2026
0

...

Read more
రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి చేతుల మీదుగా “దొరికిందా” చిత్రం ప్రారంభం

August 18, 2026
డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆర్కే ఫిలింస్ ద్వారా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ కు రాబోతున్న మూవీ

August 18, 2026
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయాణికుడికి ఘనస్వాగతం పలికిన ‘మన్యం దీరుడు’ హీరో ఆర్.వి.వి సత్యనారాయణ

August 18, 2026
“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

“సాV3” మూవీ టీజర్ ను విడుదల చేసిన బిగ్ బాస్ సెలెబ్రిటీలు

August 17, 2026
దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

దర్శకుడు క్రిష్, గేయ రచయిత చంద్ర బోస్ సంయుక్తంగా విడుదల చేసిన ధర్మస్థల నియోజకవర్గం” చిత్రంలోని ‘ధర్మో రక్షతి రక్షితః’ పాట

August 16, 2026
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన కన్నడ ‘సుప్రీమ్ స్టార్’ భార్గవ్ “తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు” మూవీ

August 14, 2026
ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

ఘనంగా TFTDDA నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం

August 12, 2026
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల సాంగ్ లాంచ్…

August 12, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In