• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

వైద్య రంగానికి పెద్దపీట -మంత్రి సత్యకుమార్ యాదవ్

admin by admin
July 30, 2024
in politics
0 0
0
వైద్య రంగానికి పెద్దపీట -మంత్రి సత్యకుమార్ యాదవ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వైద్య రంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖల మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను సోమవారం అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ తో కలిసి  ఆయన పరిశీలించారు. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా ఈ ఆసుపత్రి ఉన్నప్పటికీ 560 బెడ్లు మాత్రమే ఉన్నా యన్నారు. ప్రతిరోజు ఓపీకి 2000 నుంచి 3000 వరకు రోగులు, కనీసం 1500 మంది  వరకు ఇన్ పేషెంట్లు వస్తుంటారని తెలిపారు. సిబ్బంది, బెడ్లు, మౌలిక సదుపాయాల కొరత ఉన్నప్పటికీ నాణ్యమైన సేవలు అందిస్తున్నారని కొనియాడా రు. 2019లో మెటర్నటీ చైల్డ్ హెల్త్ బ్లాక్ మంజూర యిందన్నారు. దీనికోసం 300 కోట్లు మంజూరయినా గత  ప్రభుత్వం పునాదులు కూడా వేయలేదన్నారు.  దీన్నిబట్టి పేదల ఆరోగ్యంపై వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో గమనించాలన్నారు. ప్రస్తుతం పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకు రోగులకు నవ్వుతూ పలకరించి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. 2020లో ఎంసిహెచ్, సర్జికల్ బ్లాకులు మంజూరయ్యాయన్నారు.

వీటి పనులు మొదలుపెట్టి నాలుగు సంవత్సరాలు దాటినా అవి ఇంకా బేస్మెంట్ దశలోనే ఉన్నాయన్నారు. ఇవి పూర్తి అయి ఉంటే 1500 బెడ్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చి ఉండేవన్నారు.గత ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసి ఉంటే  ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.  ఈ ఆస్పత్రిలో  విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలి గించకుండా చిరునవ్వుతో వారికి కావలసిన  వైద్య సేవలు అందించాలన్నారు. వైద్య సిబ్బందిపై ప్రజల్లో గౌరవం పెంపొందే విధంగా చూడాలన్నారు. ప్రత్యేక నిధుల కోసం ఇంటర్నేషనల్ ఏజెన్సీ ద్వారా కృషి చేస్తామన్నారు.

ఈ సందర్భంగా అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో పడకలను 560 నుంచి 1500కు పెంచాలని కోరారు.మౌలిక సదుపాయాలు, కొత్త భవనాలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రత్యేక నిధులను కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలోని శిశు సంజీవిని ప్రత్యేక నవజాతి చికిత్స కేంద్రం , ఆర్తో వార్డ్, స్టోర్ అండ్ రికార్డ్స్ రూమ్ లను పరిశీలించారు.

Previous Post

సినిమా ఫీల్డ్‌ లో వివిధ రంగాలలో పనిచేసే అసిస్టెంట్లకు ట్రైనింగ్

Next Post

ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’ ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌

Next Post
ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ‘రక్షణ’ ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌

ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ 'రక్షణ' ఆగస్టు 1 నుంచి ‘ఆహా’ లో స్ట్రీమింగ్‌

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా
movies

రివ్యూ: ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ – నిజాయితీ గెలిస్తే న్యాయం ఎప్పటికైనా దక్కుతుందనే నమ్మకాన్ని బలంగా చెప్పిన సినిమా

by admin
June 19, 2026
0

...

Read more
హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

June 13, 2026
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In