• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

జూలై 1న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ

admin by admin
June 27, 2024
in politics
0 0
0
జూలై 1న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పథకం అమల్లో బాగంగా నూతన ప్రభుత్వం పెంచి సామాజిక భద్రతా ఫించన్లను జూలై 1 ఫించనుదారుల ఇంటి వద్దే పంపిణీకి పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నున్న 65,18,496 మంది ఫించనుదారులు అందరికీ పెంచిన ఫించన్లను ఒక్క రోజులోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయించాలన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఫించన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధి విధానాలను వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒకటవ కేటగిరీలోని వృద్దులు, వితంతువులు తదితర 11 ఉప కేటగిరీలకు చెందిన వారి ఫించను సొమ్మును రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిన నేపథ్యంలో జూలై 1 వ తేదీన రూ.4 వేలతో పాటు ఏఫ్రిల్, మే మరియు జూన్ మాసాలకు సంబందించి పెరిగి ఫించను సొమ్ము నెలకు రూ.1,000/- ల చొప్పు మూడు మాసాల ఎరియర్స్ కలుపుకుని మొత్తం రూ.7,000/-లను పంపిణీ చేయాలని ఆదేశించారు. రెండో కేటగిరీలోని పాక్షిక దివ్యాంగులకు రూ.3 వేల నుండి రూ.6 వేలకు, మూడో కేటగిరీలోని పూర్తి స్థాయి దివ్యాంగులకు రూ.5 వేల నుండి రూ.15 వేలకు మరియు నాల్గో కేటగిరీలోని కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఝకాలిక వ్యాధులతో బాధపడేవారికి రూ.5 వేల నుండి 10 వేలకు ఫించను సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేయాలని సూచించారు. మిగిలిన ఐదో కేటగిరీలోని వారికి గతంలో వలే ఎటు వంటి మార్పు లేకుండా యాధావిధిగా ఫించను సొమ్మును పంపిణీ చేయాల్సి ఉందన్నారు. పెంచిన ఫించన్ల మేరకు జూలై 1 తేదీన రూ.4,399.89 కోట్లను 65,18,496 మంది ఫించనుదారుల ఒక్క రోజులోనే పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందులో రూ.4,369.82 కోట్లను 64.75 లక్షల ఫించనుదార్ల ఇళ్ల వద్ద, మిగిలిన సొమ్ము రూ.30.05 కోట్లను రాష్ట్రానికి బయట ఉండే 0.43 లక్షల ఫించను దారులు, బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డిబిటి పద్దతో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇళ్ల వద్ద నగదు రూపేణా పంపిణీ చేయాల్సిన ఫించను సొమ్మును 29 వ తేదీ శనివారం నాడే సంబందిత బ్యాంకు బ్రాంచ్ ల నుండి డ్రా చేసుకుని సిద్దంగా ఉంచుకోవాలన్నారు. జూలై 1 న ఉదయం 6.00 గంటల నుండి ఫించనుదార్ల ఇంటి వద్దే ఫించను సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు అవసరం మేరకు ఇతర శాఖ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్నారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు చొప్పున ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించే విధంగా క్లస్టర్ల వారీగా మ్యాఫింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం కల్లా పూర్తి చేయాలన్నారు. సాధ్యమైనంత మేర ఒకే రోజు ఈ ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా ఈ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. ఆధార్ బయోమెట్రిక్, ఫేషియల్, ఐరిష్, ఆర్బిఐఎస్ అథంటికేషన్ ఆధారంగానే ఫించను సొమ్మును పంపిణీ చేయాలని, పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సర్టిఫికేట్ ను కూడా జారీ చేయాలని ఆదేశించారు. ఫించన్ల పంపిణిలో ప్రభుత్వానికి ఎటు వంటి మాట రాకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర గృహ నిర్మాణ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శులు సౌరబ్ గౌర్, సత్యనారాయణ, గ్రామ వార్డు సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులతోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Previous Post

” 14 ” చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

Next Post

ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు, రేవంత్‌..!

Next Post
ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు, రేవంత్‌..!

ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు, రేవంత్‌..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

When Goodbye Becomes the Most Romantic Hello Story
movies

When Goodbye Becomes the Most Romantic Hello Story

by admin
February 13, 2026
0

...

Read more
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In