• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

బాబు ఎత్తు.. పవన్ చిత్తు చిత్తు

admin by admin
February 24, 2024
in politics
0 0
0
బాబు ఎత్తు.. పవన్ చిత్తు చిత్తు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

టీడీపీ-జనసేన పొత్తు ఎట్టకేలకు పొడిచింది. ఓ వైపు జగన్ వరుసబెట్టి అభ్యర్థులను కొత్త నియోజకవర్గాలకు ఇంఛార్జిలుగా నియమిస్తూ పోతుంటే… ఉక్కిరిబిక్కిరి అయిన చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్… ఈరోజే ఎట్టకేలకు అత్తెసరు జాబితాతో ప్రజల ముందుకు వచ్చారు. అయితే చంద్రబాబు మళ్ళీ తన సహజనైజాన్ని బయటపెట్టుకున్నారు. చెప్పేదొకటి.. చేసేదొకటి… బయటకు ఎన్ని చెప్పినా.. ఎన్ని నీతులు మాట్లాడినా చివరగా తనకు, తన పార్టీకి లబ్ది చేకూరేలా మాత్రమే పొత్తులు ఉండాలన్నది అయన కాన్సెప్ట్. ఇదే క్రమంలో ఇన్నాళ్లుగా జనసేనలో పొత్తు అంటూ పవన్, కాపుల బలాన్ని వాడుకునేందుకు ప్లాన్ వేసిన చంద్రబాబు జాబితా ప్రకటనరోజు తన నిజరూపాన్ని బయటపెట్టారు. తొలి విడతలో మొత్తం 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు తెలుగుదేశానికి 94 సీట్లు… జనసేనకు 24 సీట్లు ఇచ్చారు. ఇక్కడే అసలు మతలబు ఉంది.. తెలుగుదేశం వాటాకింద వచ్చిన 94 స్థానాలకూ అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు.. కానీ జనసేన వాటాలోని 24 సీట్లలో కేవలం ఐదుగురిని మాత్రమే పేర్లు ప్రకటించారు.. ఇంకో 19 స్థానాల్లో ఎవరు ఉంటారన్నది తేల్చలేదు.. అంటే అక్కడ కూడా చంద్రబాబు సూచించినవాళ్లనే జనసేన తరఫున పోటీ చేయిస్తారా అన్నది తెలియాలి. ఇక జనసేన, టీడీపీ కూటమి 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారో చూడాలి… ఏదిఏమైనా పవన్ కళ్యాణ్ కు … కాపులకు చంద్రబాబు మరోసారి పోటు పొడిచినట్లే క్యాడర్ భావిస్తోంది. ఇదిలా ఉండగా టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు.. అచ్చెన్నాయుడు.. లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.. కానీ జనసేన తరఫున ఐదుగురి పేర్లు చెప్పినా అందులో పవన్ పేరు లేదు.. అంటే అయన ఎక్కడ పోటీ చేస్తారన్నది చెప్పలేదు.. చెప్పుకోలేదు.. ఆఖరుకు సేనాని పవన్ కళ్యాణ్ తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో పొత్తుకు సిద్ధమై… చంద్రబాబుకు తలొగ్గారని జనసైనికులు, పార్టీ మద్దతుదారులు ఆవేదన చెందుతున్నారు

Previous Post

యూత్ గల్లీ క్రికెటర్లకు నచ్చే “గ్రౌండ్”

Next Post

‘భూతద్ధం భాస్కర్ నారాయణ’లో చాలా బలమైన పాత్ర చేశాను: హీరోయిన్ రాశి సింగ్

Next Post
‘భూతద్ధం భాస్కర్ నారాయణ’లో చాలా బలమైన పాత్ర చేశాను: హీరోయిన్ రాశి సింగ్

'భూతద్ధం భాస్కర్ నారాయణ'లో చాలా బలమైన పాత్ర చేశాను: హీరోయిన్ రాశి సింగ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In