గాజువాక శివాజీనగర్ వద్ద యువగళం ఆవిష్కృతమైన ముగింపు ఘట్టం, కార్యకర్తల జయజయధ్వానాల నడుమ పైలాన్ ను ఆవిష్కరించిన యువనేత లోకేష్.
హాజరైన తల్లి నారా భువనేశ్వరి, నందమూరి వసుంధరాదేవి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, ఉభయగోదావరి జిల్లాల సమన్వయ కర్త ప్రత్తిపాటి పుల్లారావు, భరత్, మాజీమంత్రులు కొల్లు రవీంద్ర, అమర్ నాథ్ రెడ్డి, టిడి జనార్దన్, వంగలపూడి అనిత, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి కోండ్రు మురళి, గాజువాక ఇన్ చార్జి పల్లా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, జ్యోతుల నవీన్, తదితరులు.
కార్యకర్తల నినాదాలు, బాణాసంచా మోతలతో దద్దరిల్లిన పైలాన్ ఆవిష్కరణ ప్రాంతం.
జై తెలుగుదేశం, జయహో లోకేష్ నినాదాలతో దద్దరిల్లిన పైలాన్ శివాజీనగర్ పైలాన్ ఆవిష్కరణ ప్రదేశం. యువనేతపై పూలవర్షం కురిపించిన అభిమానులు.
గతంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్న మీకోసం పాదయాత్ర ముగించిన ప్రదేశంలోనే యువగళం పాదయాత్ర ముగింపు.