• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నవంబర్ 12న కార్తికేయ ‘రాజా విక్ర‌మార్క‌’ విడుదల

admin by admin
October 20, 2021
in movies
0 0
0
నవంబర్ 12న కార్తికేయ ‘రాజా విక్ర‌మార్క‌’ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలుగు తెరపైకి నవంబర్ 12న కొత్త గూఢచారి రాబోతున్నాడు. యాక్షన్ ప్లస్ కామెడీతో నయా ఏజెంట్ విక్రమ్ పాత్రలో మన ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి కార్తికేయ గుమ్మకొండ రెడీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత ’88’ రామారెడ్డి మాట్లాడుతూ “హీరో కార్తికేయ లేకుండా ‘రాజా విక్రమార్క’ సినిమాను ఊహించలేం. ఏజెంట్ విక్రమ్ పాత్రలో ఇరగదీశారు. యాక్టింగ్, యాక్షన్ సీన్స్ పరంగా ఆయనకు ‘రాజా విక్రమార్క’ నెక్స్ట్ లెవల్ సినిమా అవుతుంది. దర్శకుడు శ్రీ సరిపల్లికి తొలి సినిమా అయినా బాగా తీశాడు. ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. మేమంతా సినిమా పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. నవంబర్ 12 థియేటర్లలో విడుదల చేయాలనేది మా ప్లాన్. కమర్షియల్ హంగులతో పాటు కొత్తదనం కూడిన ఈ న్యూ ఏజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది” అని అన్నారు.

దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ “ఎన్ఐఏ ఏజెంట్‌ విక్రమ్ పాత్రలో కార్తికేయ కొత్తగా కనిపిస్తారు. ఆయన లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటాయి. కార్తికేయ కెరీర్‌లో బెస్ట్ లుక్‌ అని చెప్పొచ్చు. స్క్రీన్‌ప్లే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్క్రిప్ట్‌కి అనుగుణంగా ఎక్కువ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేశాం. ఒక్కోసారి ఒక్క షాట్ కోసం ప‌ర్టిక్యుల‌ర్ లొకేష‌న్‌కు వెళ్లి, పర్మిషన్ తీసుకుని షూటింగ్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. కార్తికేయతో పాటు తనికెళ్ల భరణిగారు, సాయికుమార్ గారు, పశుపతిగారు, తాన్యా రవిచంద్రన్, హర్షవర్ధన్, సుధాకర్ కోమాకుల పాత్రలకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది. ఇంపార్టెంట్ రోల్స్ క్యారెక్టరైజేషన్‌తో పాటు వాళ్ళు ఉపయోగించే వెహికల్స్, గన్స్ దగ్గర్నుంచి ప్రతి అంశంలోనూ ఎంతో జాగ్రత్త తీసుకున్నాం” అని అన్నారు.

కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.సి.మౌళి, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి, ఎడిటింగ్: జస్విన్ ప్రభు, ఆర్ట్: నరేష్ తిమ్మిరి, ఫైట్స్: సుబ్బు,నబా, పృథ్వీ శేఖర్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కృష్ణ కాంత్ , విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్: నిఖిల్ కోడూరు, సౌండ్ ఎఫెక్ట్స్: సింక్ సినిమా, సమర్పణ: ఆదిరెడ్డి. టి, నిర్మాత: ’88’ రామారెడ్డి, దర్శకత్వం: శ్రీ సరిపల్లి.

Previous Post

హీరో ధనుష్ కొత్త చిత్రం ‘నానే వరువేన్’ షూటింగ్ మొదలు!!

Next Post

అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

Next Post
అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్
movies

24వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రారంభించిన గోయాజ్

by admin
February 21, 2026
0

...

Read more
ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

ఇళయరాజా గారి ఆ ఒక్క మాటతోనే మేము విజయం సాధించాం- ‘ఏ బ్యూటీఫుల్ బ్రేకప్’ సక్సెస్ మీట్‌లో హీరో తక్ష్

February 18, 2026
ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

ప్ర‌భుత్వ కొలువుల‌కు చిరునామా- య‌ర్ర‌బండ‌

February 17, 2026
When Goodbye Becomes the Most Romantic Hello Story

When Goodbye Becomes the Most Romantic Hello Story

February 13, 2026
“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

“ఎ బ్యూటిఫుల్ బ్రేకప్” ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల

February 11, 2026
WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

February 10, 2026
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In