మాట్లాడితే 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబుని ప్రజలు నమ్మేట్టుగా కనిపించడం లేదు. ఒకప్పుడు విషయం 2020 అని హడావిడి చేసిన పెద్దమనిషి ఇప్పుడు విజన్ 2047 అంటే విచిత్రంగా ఉండదా మరి. 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సీఎం అయిన తర్వాత విజన్ 2020 అంటూ ప్రజల ముందుకు వచ్చిన చంద్రబాబు తీరా 2020 వచ్చేసరికి వెళ్లి విపక్షంలో కూర్చున్నారు.
పోనీ ఈ పదవిలో ఉన్నన్ని రోజులు చేసింది ఏమన్నా ఉందా అంటే పేరుకుపోయిన అప్పుల ఖాతాలు తప్ప.. పెద్దగా చేసింది ఏమీ లేదు. తాను రూలింగ్ లో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించిన చంద్రబాబు…ఇప్పుడు తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూలింగ్ పార్టీని విమర్శిస్తున్నారు. ఇంతకుమించి పెద్ద తేడా ఏమీ లేదు. ఇక 2024 ఎన్నికలకు పెద్దగా సమయం లేదు కాబట్టి ఇంకో మ్యాజిక్ కింద విజన్ 2047 అంటూ ప్రజలలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.
బీజేపీ 2047 ఇండియాకు అమృతకాలమని చెబుతోంది. ఎందుకంటే అప్పటికి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది కాబట్టి ఈలోపు భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని కోరుకుంటూ ఆ పీరియడ్ని అమృతకాలం అని అంటున్నారు. ఈ ఐడియా ని అచ్చంగా కాపీ కొట్టిన పచ్చ పార్టీ మరో పాతికేళ్లలో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలో అన్న విషయంపై చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ని రూపొందించినట్లుగా వెల్లడిస్తోంది.
అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు లాంచ్ చేసిన ఈ విజన్ 2047 వేడుకకు జనాలు కరువయ్యారు. ఖాళీ కుర్చీలకు ,బాడుకి తెచ్చుకున్న పదిమంది మనుషులకు తన విజన్ ను ఎక్స్ప్లెయిన్ చేసి చంద్రబాబు సంతృప్తి పడ్డారు. మనం చెప్పే మాటల్లో నిజం ఉంటే జనం వాళ్లంతట వాళ్లే వస్తారు…చంద్రబాబు మీటింగ్ కి జనం కరువయ్యారు అంటే వాళ్ల మనసులో అతని మీద నమ్మకం కరువైనట్లే కదా.. అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే పందా కొనసాగితే…వన్స్ దేర్ వాస్ ఏ పార్టీ…అన్నట్లుగా మారుతుంది టిడిపి పరిస్థితి.