వై నాట్ 175… గత కొన్నాళ్లుగా సీఎం వైయస్ జగన్ తరచూ చెబుతున్న మాట ఇది. 2019 ఎన్నికల్లో 151 సీట్లలో గెలిచి వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ ప్రవేశపెట్టనన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు సీఎం జగన్.
అర్హతే ప్రామాణికంగా ఆయా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అలాగే ఇచ్చిన హామీల్లో దాదాపు 99 శాతం హామీలను అమలు చేశారు. దీంతో ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో వారు వైయస్సార్సీపీని మునుపటి కంటే ఎక్కువగా ఆధరిస్తున్నారు.
దాదాపు ప్రతి పేద కుటుంబానికి సంక్షేమం అందించడంతో పాటు చెప్పిన హామీలను నెరవేర్చిన నేపథ్యంలో సీఎం వైయస్ జగన్ ఈసారి 175 స్థానాల్లో ఎందుకు విజయం సాధించలేమని పార్టీ నాయకులకు చెబుతున్నారు. అలా జరిగితే ప్రజలకు మరింతగా సంక్షేమం అందిచగలమని అంటున్నారు.
అందుకే వై నాట్ 175 అంటూ పార్టీ శ్రేణులకి దిశా నిర్దేశం చేస్తున్నారు. అయితే దీనిని ఇన్నాళ్ళు ప్రతిపక్ష పార్టీలు తేలిగ్గా తీసుకున్నాయి. కానీ సీఎం వైయస్ జగన్ ఈ మాటను ఊరికే అనలేదని, తలుచుకుంటే అది పెద్ద విషయం కాదని సర్వేలు నిరూపిస్తున్నాయి.
రెండు నెలల క్రితం టైమ్స్ నౌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏపీలో వైయస్సార్సీపీకి 22-23 ఎంపీ స్థానాలు వస్తాయని తేలింది.*
*ఇక ప్రస్తుతం అదే టైమ్స్ గ్రూప్ కి చెందిన టైమ్స్ నౌ నవభారత్ నిర్వహించిన జన్ గన్ కా మన్ సర్వేలో ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏపీలో వైయస్సార్సీపీ 24-25 ఎంపీ సీట్లు గెలుస్తుందని స్పష్టమైంది.* ప్రతిపక్ష టీడీపీ కేవలం 0-1 స్థానాలకే పరిమితం అవుతుందని తేలింది. సీఎం వైయస్ జగన్ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుని ప్రజల్లో నమ్మకం పెంచుకోవడం, అలాగే చంద్రబాబుని మళ్ళీ ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో అన్నీ సర్వేల్లోనూ ఇలాంటి ఫలితాలే వెల్లడవుతున్నాయి.
*వీటిని బట్టి చూస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైయస్సార్సీపీ 175 కి 175 స్థానాల్లో గెలుపొందడం పెద్ద కష్టం కాదని, వై నాట్ 175 అన్న వైయస్ జగన్ ఆ లక్ష్యాన్ని చేరుకోగలరని స్పష్టమవుతోంది.*