• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

పిల్లలను స్కూలుకు పంపండి, పనికి కాదు: CRY

admin by admin
June 12, 2023
in politics
0 0
0
పిల్లలను స్కూలుకు పంపండి, పనికి కాదు: CRY
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం 2023
పిల్లలను స్కూలుకు పంపండి, పనికి కాదు: CRY
ఈ ఏడాది జూన్ 12వ తేదీ ‘ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినం’ సందర్భంగా, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల లోని ప్రతి చిన్నారికీ భద్రమైన, ఆరోగ్యవంతమైన, అండ లభించే వాతావరణంలో ఆనందంగా పెరిగే హక్కు అమలయ్యేలా మరింత తీవ్రంగా కలసికట్టుగా కృషి చేయటానికి ప్రతిజ్ఞ చేయాలని CRY పిలుపునిస్తోంది

హైదరాబాద్, జూన్ 12, 2023: బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా అగ్రస్థాయి భారతీయ స్వచ్ఛంద సంస్థ CRY – చైల్డ్ రైట్స్ అండ్ యు – తెలంగాణ లోని మూడు జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు జిల్లాల్లో క్షేత్రస్థాయిలోని తన భాగస్వామ్య సంస్థలతో కలిసి వారం రోజుల అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. బాల కార్మిక వ్యవస్థను అంతం చేయడానికి సామూహిక నిబద్ధత, విశ్రాంత కృషి అవసరమమంటూ, ‘‘సంకల్పం, దృఢ చిత్తం కలిసినపుడు మార్పు సాధ్యమవుతుంది‘‘ అన్న అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ప్రకటనకు అనుగుణంగా, CRY ఈ కార్యక్రమాలను చేపట్టింది.
తెలంగాణ లో ఇతర జిల్లాలతో పోల్చినపుడు బాల కార్మికత అధికంగా ఉన్న మూడు జిల్లాలు – ఖమ్మం, నాగర్ కర్నూల్, మేడ్చల్ జిల్లాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో CRY తన భాగస్వామ్య సంస్థలతో కలిసి జూన్ 6 నుంచి 12 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తద్వారా, ‘‘పిల్లలను పనిలో పెట్టుకోవటం ద్వారా వారికి సాయం చేయొద్దు.’’ అనే నినాదంతో CRY జాతీయ స్థాయిలో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా స్పష్టమైన కార్యాచరణ పిలుపును విస్తృత ప్రజా సమూహాన్ని చేరవేయటానికి కృషి చేస్తోంది.
వారం రోజుల పాటు కొనసాగే ఈ కార్యాచరణలో స్కూళ్లు, సామాజిక బృందాల స్థాయిల్లో అవగాహన పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించడం, గ్రామాలలో ప్రదర్శనలు నిర్వహించడం, బాల కార్మిక రహిత సమాజాన్ని రూపొందించే క్రమంలో ప్రతి చిన్నారీ పనికి కాకుండా పాఠశాలకు వెళ్లేలా చూడటానికి స్థానిక, జిల్లా స్థాయి యంత్రాంగంతో కలిసి పని చేయటం వంటి కార్యక్రమాలు ఉన్నాయని CRY తెలిపింది.
ఆందోళన కలిగిస్తున్న పరిస్థితి
బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ ప్రపంచంలో నిరంతర సమస్యగానే కొనసాగుతోంది. బాల కార్మికులపై UNICEF, ILO విడుదల చేసిన “చైల్డ్ లేబర్ గ్లోబల్ఎస్టిమేట్ 2020: ట్రెండ్స్ అండ్ ది రోడ్ ఫర్ ఫార్వర్డ్” ప్రకారం, “2020 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల మంది చిన్నారులు (5 నుండి 17 సంవత్సరాల వయసు పిల్లలు) – 6.3 కోట్ల మంది బాలికలు, 9.7 కోట్ల మంది బాలురు – బాల కార్మికులుగా ఉన్నట్లు అంతర్జాతీయ అంచనాలు సూచిస్తున్నాయి.’’
ఈ బాల కార్మికులలో దాదాపు సగం మంది “ప్రమాదకరమైన పనిలో ఉన్నారు. ఇది వారి ఆరోగ్యం, భద్రత, నైతిక అభివృద్ధికి నేరుగా ముప్పు కలిగిస్తుంది” అని కూడా ఆ నివేదిక వెల్లడిస్తోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5 నుండి 13 సంవత్సరాల వయసు పిల్లలు 75 లక్షల మందికి పైగా (కచ్చితమైన సంఖ్య 76,79,035) బాల కార్మికులుగా ఉన్నారు. వీరిలో 42,06,708 మంది బాలురు కాగా, 34,72,327 మంది బాలికలు ఉన్నారు. అదే విధంగా, 14 నుండి 17 సంవత్సరాల వయసులోని కిశోర బాలబాలికలు 1,61,00,448 మంది వాణిజ్య పనుల్లో ఉన్నారు. వీరిలో 1,01,40,659 మంది బాలురు కాగా, 59,59,789 మంది బాలికలు ఉన్నారు.
2011 లో విభజనకు ముందటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 4,96,451 మంది బాల కార్మికులు (5 నుంచి 13 సంవత్సరాల వయసు చిన్నారులు) ఉన్నారని, వారిలో 2,52,957 మంది బాలురు, 2,43,494 మంది బాలికలు ఉన్నారని అవే గణాంకాలు చూపిస్తున్నాయి.
ఆ గణాంకాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పని చేస్తున్న కిశోర బాలబాలికల (14 నుండి 17 సంవత్సరాల వయసు పిల్లలు) సంఖ్య 11,86,285 గా ఉంది. వీరిలో 6,65,409 మంది బాలురు కాగా, 5,20,876 మంది బాలికలు ఉన్నారు.
సమాచార కొరత: పెద్ద అవరోధం
దేశ వ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ తాజా పరిస్థితులకు సంబంధించి, ఒక దశాబ్దం కంటే పాతవైన 2011 జనాభా లెక్కలు మినహా ఇటీవలి కాలంలో సేకరించిన అధికారిక సమాచారం కానీ, ప్రామాణిక సమాచారం కానీ అందుబాటులో లేదు. ఇది ప్రధాన అవరోధం. పైగా కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్థితుల్లో బలవంతంగా కార్మికులుగా మారిన పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగిందని పలు అంచనాలు చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సరైన సమాచారం లేకపోవటం బాల కార్మికత వ్యవస్థను రూపుమాపాలనే లక్ష్య సాధనకు పెద్ద అవరోధంగా నిలుస్తోంది.
“సమాజ స్థాయిలో ప్రజా సమూహాలకు తగినంతగా జీవనోపాధి అవకాశాలను సృష్టించడం చాలా ముఖ్యం, అలా చేయటం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లలను బలవంతంగా పనికి పపంచే పరిస్థితులు లేకుండా చూడవచ్చు. అయితే, బాలకార్మికత వ్యాప్తి, విస్తృతి, పరిస్థితి గురించి మనకు కచ్చితంగా తెలియకపోతే.. దానిని రూపుమాపటం కోసం నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించటం కష్టం. బాల కార్మికతకు ప్రస్తుత స్థితికి సంబంధించి సవివరమైన, తాజా గణాంకాలు, సమాచారం ఉన్నట్లయితే.. ఈ పరిస్థితిని మార్చటానికి అది సాయపడుతుంది. సమస్యను నిర్మూలించడానికి చాలా దోహదపడుతుంది” అని CRY (South) రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ చెప్పారు.
“దేశం, అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బాల కార్మికతను తగ్గించడంలో గత దశాబ్ద కాలంలో గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, కోవిడ్ మహమ్మారి ఆ ప్రగతిని అడ్డుకుని తిరోగమనంలోకి నెట్టింది. ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. కుటుంబాలను పేదరికంలోకి నెట్టివేసింది. ఆ ఫలితంగా, ఎంతో మంది చిన్నారులు బడికి దూరమయ్యారు. బలవంతంగా బాల కార్మికులుగా మారారు” అని జాన్ వివరించారు.
ముందుకు సాగే మార్గం
“ఈ పరిస్థితుల్లో మనం బాలల సంరక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్య మరింతగా అందుబాటులో ఉండేలా చూడటంతో పాటు, పేదరికం నుండి కుటుంబాలు, చిన్నారులు బయటపడేందుకు దోహదపడే సామాజిక మద్దతు వ్యవస్థలను పెంపొందించటం చాలా ముఖ్యం. తద్వారా చిన్నారులను, వారి బాల్యాన్ని దోపిడీ చేసే విషవలయం అంతమవుతుంది” అని ఆయన వివరించారు.
వచ్చే మూడేళ్లలో దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో Child Rights and You సంస్థ తన కార్యక్రమాలు అమలు చేస్తున్న 553 గ్రామాలను బాల కార్మిక రహిత గ్రామాలుగా మార్చాలనే లక్ష్యంతో CRY పనిచేస్తోందని ఆయన చెప్పారు.
‘‘ఈ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రతి చిన్నారికీ భద్రమైన, ఆరోగ్యవంతమైన, అండ లభించే వాతావరణంలో ఆనందంగా పెరిగే హక్కు అమలయ్యేలా మనం మరింత తీవ్రంగా కృషి చేద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. మనమందరం కలిసి బాల కార్మికతను అంతం చేయవచ్చు. బాల్యాన్ని పరి రక్షించొచ్చు. మన పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించవచ్చు’’ అని జాన్ పిలుపునిచ్చారు.

Previous Post

జై శ్రీ రావణ్ నినాదంతో… “కోడ్ రామాయణ” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Next Post

YS Jagan On A Mission To Deliver 2.62 L TIDCO Houses

Next Post
YS Jagan On A Mission To Deliver 2.62 L TIDCO Houses

YS Jagan On A Mission To Deliver 2.62 L TIDCO Houses

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం
movies

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

by admin
February 28, 2026
0

...

Read more
పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

February 28, 2026
హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

February 28, 2026
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్  ప్రాజెక్ట్ ప్రారంభం

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

February 28, 2026
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

February 28, 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

February 28, 2026
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

February 28, 2026
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

February 28, 2026
సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

సుహాసిని, వినోద్ కుమార్ ఆవిష్కరించిన ‘ఓ మాట అనుకుందామా!’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్!

February 27, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In