మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా మంచు విష్ణు మా సభ్యులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మోహన్ బాబు హాజరయ్యారు. ఈ సంద్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ… 2021 మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అక్టోబర్ 13న మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పరిశ్రమలో ఎంతో అలజడి నెలకొంది. నేను మా అసోసియేషన్ కు మాత్రమే కాదు ప్రేక్షకులకు కూడా జవాబుదారినే. మా ఎన్నికల్లో నేను చేసిన వాగ్ధానాలు 90 శాతం పూర్తయ్యాయి. సంక్రాంతి తర్వాత మా యాప్ కు తీసుకొస్తాం. నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుకులెట్ తయారుచేశాం. మా అసోసియేషన్ లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. మా అసోసియేషన్ సభ్యత్వాన్ని కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నాం. మా అసోసియేషన్ లో సభ్యత్వం ఉన్నవాళ్లే సినిమాల్లో నటించాలని నిర్మాతలకు సూచించాం. నిర్మాతల మండలి కూడా మా సూచనను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఏ నటీనటులైన, కార్యవర్గ సభ్యులెవరైనా ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లిన వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. మా కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు అనర్హులవుతారు.
మా క్రమశిక్షణ కమిటీలో లేని మెగాస్టార్ చిరంజీవి..
మా క్రమశిక్షణ కమిటిలో మోహన్ బాబు, గిరిబాబు, జయసుధ, స్వప్నదత్ వున్నారు.