రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పాలన వైసీపీ ప్రభుత్వం సాగిస్తోందని పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.
మండల కేంద్రంలోని చౌడేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించిన టిడిపి కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జే బ్రాండ్స్ ,జే టాక్స్ లతో ప్రజలను దోపిడీ చేస్తోందని అన్నారు .మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచక పాలన తప్పదని ప్రజలను హెచ్చరించారు.
బీసీలకు రాజకీయ చైతన్యం తెచ్చింది నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడు లే అని గుర్తు చేశారు ఈరోజు బీసీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల సమస్యలపై తమ వాణి ని వినిపిస్తున్నారంటే అందుకు తెదేపానే ప్రధాన కారణం అన్నారు.
తెదేపా తోనే బీసీ సాధికారత సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీనే గుర్తుచేశారు. వడ్డెర్ల సామాజికవర్గానికి కూడా చట్ట సభల్లో ప్రాధాన్యత కల్పించేందుకు తన వంతు సహకారం అందిస్తానని, అవసరమైతే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో బీసీలకు పెద్దపీట వేశామని భవిష్యత్తులో కూడా వారికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు .