ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు జిల్లా కు చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు సోదరుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా జగన్‌ను కలిశారు. సీఎం ఆహ్వానం మేరకు కోటంరెడ్డి సోదరులు తాడేపల్లిలో జగన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలు, రూరల్ నియోజకవర్గంలో అభివృద్ది, సంక్షేమాలపై వారిరువురూ సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో గిరిధర్ రెడ్డి పేరును పదేపదే ప్రస్తావించారు. పార్టీ కోసం, రూరల్ అభివృద్ది కోసం చేస్తోన్న కృషిని అభినందించారు. లో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహిస్తుండడం పట్ల శ్రీధర్ రెడ్డిని జగన్ ప్రత్యేకంగా అభినందించారు.