కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. పిఠాపురం నియోజక వర్గంలో గొల్లప్రోలు నగర పంచాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కాపు నేస్తం లబ్ధిదారులకు సాయాన్ని విడుదల చేయనున్నారు.
వైఎస్సార్ కాపు నేస్తం పథకం (Kapu Nestam Scheme) లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కాపు మహిళలకు సీఎం జగన్ సాయం అందించనున్నారు. పథకంలో భాగంగా ముఖ్యమంత్రి స్వయంగా మూడో విడత పంపిణీ చేయనున్నారు. రేపు కాకినాడ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. పిఠాపురం నియోజక వర్గంలో గొల్లప్రోలు నగర పంచాయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కాపు నేస్తం లబ్ధిదారులకు సాయాన్ని విడుదల చేయనున్నారు. కాపు సామజిక వర్గంలోని ఉపకులాలకు చెందిన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాల కు చెందిన మహిళలు లబ్ధిదారులు. 45 ఏళ్ళు నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15 వేల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందిస్తోంది. నేరుగా మహిళల ఖాతాలో ప్రభుత్వం జమచేస్తుంది. నగదు జమ అయిన వెంటనే ఒక మెసేజ్ కూడా వస్తుంది. వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా సుమారు 3.2 మంది మహిళలు లబ్ధిపొందనున్నారు. ఏటా సుమారు రూ.490 కోట్లను వెచ్చిస్తోంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ. 75వేలను ఆర్ధిక సాయం అందించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంలో లబ్ధిదారుల మహిళలు నెలసరి ఆదాయంలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతంలో రూ.12 వేల లోపు ఉండాలి. ఇక స్థిరాస్తుల విషయంలో కూడా పరిమితులు ఉన్నాయి. కుటుంబంలోని ఎవరైనా ప్రభుత్వపు వృద్ధాప్యపు, వికలాంగ పెన్షన్ పొందుతున్నవారు కూడా కాపునేస్తం పథకానికి అర్హులు.