అనంతపురం జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఉండాలి. నిన్న మొన్నటి వరకు అలాగే జరిగింది. కానీ గత వారం రోజులుగా ఆ అంశంపై పీఠముడి ఏర్పడింది. ఒక సబ్ రిజిస్ట్రార్ అనారోగ్య కారణాలతో కొద్దిరోజులు సెలవులో ఉన్నారు. కోలుకున్న అనంతరం విధుల్లో చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఊహించని విధంగా ఆయన చేరికపై కొర్రీ వేశారు. ఇందులో లోగుట్టు దాగి ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టకుండా కొందరు అడ్డంకులు సృష్టించినట్లు సమాచారం. జిల్లాలో ఇద్దరు అధికారులు ఉన్నప్పటికీ ఇంతవరకు ఆ అంశంపై దృష్టి సారించింది లేదు. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉందనేది తెలియ రాలేదు. కార్యాలయంలోని కొందరి ప్రభావంతో జిల్లా ఉన్నతాధికారి ఆయనకు బాధ్యతలు అప్పగించలేదని ప్రచారం జరుగుతోంది.
జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే సెలవులో వెళ్లి తిరిగి వచ్చిన ఎస్ ఆర్ ఓ విధుల్లో చేరకుండా ఒక అధికారి ద్వారా అడ్డంకులు సృష్టించినట్లు తెలియ వచ్చింది. ఆయన సెలవులో వెళ్ళినప్పటికీ ఆయన స్థానంలో తాత్కాలికంగా మరొకరిని నియమించలేదు. ఓవైపు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలను ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం నిర్వాకం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. అనంతపురంలో ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ లు ఉంటే రిజిస్ట్రేషన్ లు చక చక జరిగిపోయే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఒకరికి బాధ్యతలు ఇవ్వకుండా మిగిలిన ఒక్కరినే కొనసాగించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయం రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల దృష్టికి వెళ్లినా మౌనంగా ఉండి పోయారన్న l ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో అసలు ఏం జరుగుతుందని చర్చ కార్యాలయ సిబ్బంది లోనే జరుగుతోంది. ఒక అధికారి ఈ విషయంలో చక్రం తిప్పినట్లు సమాచారం. కాగా ఉన్న ఒక్కరు ఒకరోజు పాటు లీవ్ లో వెళ్ళిపోయారు. ఆస్థానంలో ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ గా రికార్డు రూమ్ సీనియర్ అసిస్టెంట్ ను ఆ స్థానంలో నియమించారు. లీవ్ లో వెళ్లి తిరిగి వచ్చిన ఆయనకు కాకుండా రికార్డు రూమ్ సీనియర్ అసిస్టెంట్ కు ఎలా ఆ ఒక్కరోజు బాధ్యతలు అప్పగించారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు, ఎవరికి తోచినట్లు వారు కార్యాలయంలో వ్యవహారాలు చక్కబెట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా కేంద్రంలో ఇద్దరు అధికారులు ఉన్నప్పటికీ ఇలాంటి పరిస్థితులు నెలకొనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తం వ్యవహారాన్ని ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కే అప్పగించడం వెనుక ఆంతర్యం అంతు చిక్కడం లేదు. ఒక జిల్లా అధికారి ఈయనకే వత్తాసు పలుకుతు లీవ్ లో వెళ్లి తిరిగి వచ్చిన ఆయన పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కార్యాలయంలో ఎన్ని వ్యవహారాలు ఉన్నా ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా ఉండాలే కాని ఒకరి పట్ల అనుకూలంగా, మరొకరి పట్ల వివక్ష చూపడం అధికారులకు సముచితం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ పక్షపాత ధోరణులు అవలంబించడం జరిగితే ఇందులో భారీ ఎత్తు గడలే ఉన్నట్లు అనుమానాలు కలగక మానవు. ఈ అంశాన్ని అధికారులు గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అనంతపురం అర్బన్ లో ప్రతి రిజిస్ట్రేషన్ కు ఒక ధర నిర్ణయించారా? 0.8 భూముల రిజిస్ట్రేషన్ జరుగుతోందా? భూముల ధరలను బట్టి ముడుపుల ధర నిర్ణయిస్తున్నారా? ఈ వ్యవహారం మొత్తం ఒక రైటర్ కనుసన్నల్లో జరుగుతున్నాయా?