• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

వరద బాధితుల పట్ల కేంద్రం వివక్ష – శైలజనాథ్

admin by admin
July 29, 2022
in politics
0 0
0
వరద బాధితుల పట్ల కేంద్రం వివక్ష – శైలజనాథ్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వరద ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పర్యటనతో బాధితులకు వొరిగిందేమీ లేదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ ఆరోపించారు. పోలవరం ముంపు ప్రాంతాల బాధితులకు పరిహారం, పునరావాసం విషయంలో సీఎం స్పష్టమైన ప్రకటన చేయలేదని విమర్శించారు. ఒక్క రూపాయి ఆర్థిక సాయం ప్రకటించకుండా ముద్దులు, ఆశీర్వాదాలతో ప్రజలకు ఏం ప్రయోజనమేమి ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన ఈ మేరకు విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం ప్రశ్నార్థకంగా మార్చిందని ద్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు పనిపూర్తి, నిర్వాసితులకు పరిహారం విషయంలో జగన్ సర్కార్ విఫలమైందని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని జగన్ మోహన్ రెడ్డి నీరుగారుస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుగా మారుతుందా లేక బ్యారేజిగానే మిగిలిపోతుందా అనేది ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి నిధులు సాధించటం జగన్మోహన్ రెడ్డికి చేతకాదా అని నిలదీశారు. చేత కాకపోతే పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించేయాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే పోలవరం ప్రాజెక్టు పై వివక్ష చూపుతోందని విమర్శించారు.

గోదావరి వరదల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సహాయక చర్యలు, పునరావాసం, ఆహారం అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని శైలజనాథ్ విమర్శించారు. తక్షణం కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టం అంచనా వేసి బాధితులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, కనీసం కేంద్ర బృందాలు కన్నెత్తి చూడలేదని తెలిపారు. వరదల ఉధృతికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వ స్పందన లేదన్నారు. డెల్టాలోని లంక గ్రామాలు, పోలవరం పరిధిలోని ఏడు మండలాల పరిస్థితి ఘోరంగా ఉందని తెలిపారు. పోలవరం పరిసర ప్రాంతాల్లో ఇటీవల పర్యటించామని, అక్కడ కనీసం బాధితులకు ఆహారం, నీళ్లు, కొవ్వొత్తులు, విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేయలేదన్నారు.

పెదమల్లంలంక, భీమలాపురం, కాపులపాలెంలో బాధితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, ఇక్కడ వరద తగ్గడంతో పునరావాస కేంద్రాలను ఎత్తివేశారని, బాధితుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. కేంద్రం వరద బాధితులను ఆదుకోవడంపై దృష్టి పెట్టలేదని శైలజనాథ్ విమర్శించారు. పండ్లు, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. లంక భూముల్లో జరిగే పంట నష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీమా ఇవ్వడం లేదని, నష్టపోయిన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కౌలుదారులకు కూడా నష్టపరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

గోదావరి వరదలకు ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఏడువేల ఇళ్లు దెబ్బతిన్నట్లు లెక్కలు తేలాయని, ఇందులో పూర్తిగా నేలమట్టమైనవే అధికంగా ఉన్నాయని, గోదావరి వరదలు సృష్టించిన బీభత్సంతో వేల కుటుంబాలకు నిలువ నీడ లేకుండాపోయిందన్నారు. దీంతో బాధితులు పునరావాస శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారని శైలజనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆగస్టులో మరోమారు వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రతి కుటుంబానికీ మూడు నెలలకు సరిపడా బియ్యంతోపాటు నిత్యావసర సరుకులతో కూడిన కిచెన్‌ కిట్లను అందించాలని డిమాండ్‌ చేశారు. వరద ప్రభావానికి సర్వం కోల్పోయిన పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని లేదా రూ.ఐదు లక్షలు పరిహారం అందించాలని కోరారు. ఇళ్లలో చేరిన బురదను తొలగించుకునేందుకు రూ.10 వేలు అందించాలని డిమాండ్‌ చేశారు. పండ్ల తోటలకు ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు, కూరగాయ పంటలకు రూ.25 వేలు, మిగిలిన పంటలకు రూ.30 వేలు పరిహారం తక్షణం అందించాలని డిమాండ్‌ చేశారు. మొబైల్‌ వైద్య శిబిరాలను వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని శైలజనాథ్ కోరారు.

Previous Post

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట

Next Post

విడుదలైన ‘’నేను c/o నువ్వు’’ మోషన్ పోస్టర్

Next Post
విడుదలైన ‘’నేను c/o నువ్వు’’ మోషన్ పోస్టర్

విడుదలైన ‘'నేను c/o నువ్వు’' మోషన్ పోస్టర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్
movies

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

by admin
May 19, 2026
0

...

Read more
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

May 11, 2026
జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా “ఎయిరలక్సె” హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ప్రారంభం

May 10, 2026
హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్

May 9, 2026
Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

Review : లావణ్య త్రిపాఠి ‘సతి లీలావతి’

May 8, 2026
ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

ఘనంగా జరిగిన ‘వా తారా రంపం’ సెలబ్రిటీ అంత్యాక్షరి షో కర్టెన్‌రైజర్‌

May 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In