జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ప్రకటించగానే ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలయ్యిందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ స్పష్టం చేశారు. అవనిగడ్డ వేదికగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరించి అసహ్యంగా అబద్దాలు.. అవాస్తవాలు ప్రచారం చేశారని ఆరోపించారు. శ్రీ జగన్ రెడ్డి వ్యాఖ్యలు భూత వైద్యుడు వేద మంత్రాలు వల్లించిన విధంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటా అబద్దమేనన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం.. వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని దోచుకోవడ దాచుకోవడం.. మహిళల మీద అఘాయిత్యాలు.. సొంత సామాజికవర్గానికి వందల సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు వేయడం.. తల్లిచెల్లిని పక్క రాష్ట్రానికి గెంటేయడం.. ఇలాంటి చర్యలతో శ్రీ జగన్ రెడ్డి గారు సభ్య సమాజానికి, మహిళా లోకానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
గురువారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పోతిన మహేష్ మాట్లాడుతూ “అవనిగడ్డ వేదికగా ముఖ్యమంత్రి గారి మాటలు వింటే ఆయనకు ఏదో వినికిడి సమస్య వచ్చిందేమోనన్న అనుమానం కలుగుతోంది. ఆయన్ని వెంటనే ఓ ఈఎన్టీ స్పెషలిస్టుకి చూపాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని కోరుతున్నాం. వారిని హైదరాబాద్ లో గాని బెంగళూరులోగాని చూపించాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి గారి మాటల్ని వక్రీకరించి చాలా అసహ్యం.. అవాస్తవాలు ప్రచారం చేశారు. శ్రీ జగన్ రెడ్డి మాటలు పచ్చి అబద్దాలు. ప్రజల్ని మోసం చేసే విధంగా ఉన్నాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో చెత్త పాలన గురించి.. ఆ పాలకుల చెత్త బుద్దుల గురించి మాట్లాడితే.. ముఖ్యమంత్రి వాటిని దురుద్దేశ పూర్వకంగా వక్రీకరించారు. శ్రీ జగన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వైద్యులకు చూపాలి. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హత్య చేసిన వ్యక్తి చేతులు కడుక్కుని హతుడి ఫోటోకి నమస్కరించిన చందంగా ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారి నైజం అర్ధమయ్యింది. వారు బయటకి వచ్చి నీతులు చెబుతారు.. వారి పార్టీ నాయకులు చాలా మంది వ్యభిచార కొంపల్లో దూరతారు. అప్పుడు ఆయనకు మాట్లాడేందుకు మాటలు రావు. వర్షాకాలం వస్తే అవనిగడ్డ ప్రజలు పెద్ద ఎత్తున పాము కాటుకు బలైపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ జగన్ రెడ్డి అనే కట్ల పాము అదే అవనిగడ్డ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షుల వారి మీద విషం చిమ్మే ప్రయత్నం చేసింది. అలాంటి విషపు ప్రచారాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తాకలేవు. మీరు చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.
• విశాఖలో అప్రజాస్వామికంగా వ్యవహరించారు
విశాఖలో మూడు రోజుల పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా పోలీసులతో కట్టడి చేసి దుర్మార్గంగా వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యానికి అది చీకటి రోజు అని రాష్ట్ర ప్రజలు నినదిస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే ఒక రోజు శ్రీ సోము వీర్రాజు గారు, మరో రోజు శ్రీ చంద్రబాబునాయుడు గారు ఆయన్ని కలిశారు. అంతా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కలసి పోరాటం చేద్దామని నినదించారు.శ్రీ చంద్రబాబు నాయుడు గారు కలవగానే నిరంకుశ ప్రభువు శ్రీ జగన్ రెడ్డికి చెమటలు పట్టాయి. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఈ రోజు అవనిగడ్డలో కట్ల పాములా బుసలు కొట్టారు.
• సుప్రీం నిర్ణయంతో మీ ముసుగు తొలగిపోయింది
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామంటే భయపడ్డారా? లేదా శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటేనే మీకు భయం పట్టుకుందని స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రజల్ని నమ్మించేలా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మీ దోపిడి గురించి ప్రజలకు తెలిసి పోయింది. మీ బాబాయ్ హత్య కేసు పక్క రాష్ట్రాల్లో విచారణ చేయాలని అత్యున్నత న్యాయస్థానం చెప్పినప్పుడే హత్యలో మీ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని ప్రజలకు తెలిసిపోయింది. హత్యలో మీ భాగస్వామ్యం కూడా ఉందన్న ముసుగు తొలగిపోయింది. మీరు స్వాతిముత్యం స్థాయిలో నటించినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. శ్రీ జగన్ రెడ్డి గారికి 40 నెలలుగా వాళ్ల మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా మాట్లాడిన మాటలకు నొప్పి కలగలేదు. వైసీపీ నాయకులు బూతు భాషను రాష్ట్ర అధికార భాషగా మార్చినప్పుడు ఇబ్బంది అనిపించలేదు. ఇప్పుడు మిమ్మల్ని అంటే నొప్పి కలిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వారి మాతృమూర్తిని అసభ్యంగా తిడితే ఆ రోజు ఎందుకు ఒక్క మాట మాట్లాడలేదు. ఆ జాఢ్యం వైసీపీ మహిళా నాయకులకు కూడా సోకింది. వారికి కూడా బూతు వైరస్ సోకింది.
సన్నీ లియోన్ సిగ్గుపడుతోంది
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. దాని గురించే మాట్లాడారు. గతంలో మీ నాయకులు అంబటి రాంబాబు, సజ్జల, అవంతి, సన్నిలియోన్ సిగ్గుపడే స్థాయిలో నటించిన గోరంట్ల మాధవ్ గురించో జగన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలి. మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కామసూత్రాకి బ్రాండ్ అంబాసిడర్లలా తయారయ్యారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరించి మూడు పెళ్లిళ్లు చేసుకోమంటున్నారు.. సభ్య సమాజం ఎక్కడికి పోతుంది అంటున్నారు. గోరంట్ల మాధవ్ సకలం చూపించినప్పుడు ఆ సమాజం ఎక్కడికిపోయింది. పర్లేదు ఆఫీస్ కి వచ్చెయ్ కానిచ్చేద్దాం అన్నప్పుడు సభ్య సమాజం గుర్తుకురాలేదా? అర్ధగంట, గంట అన్నప్పుడు ఏమయ్యింది. ఇవన్నీ మహిళలకి ఇబ్బంది కలిగే మాటల్లా ముఖ్యమంత్రి గారికి తోచలేదా? వివాహం జరిగాక భరణం చెల్లించి విడాకులు తీసుకున్న తర్వాత మరో వివాహం చేసుకున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీ బూతు భాషలో చెబితే మీకు ఆర్ధమయ్యేదేమో. రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమయ్యేలా తెలుగులో చెప్పబట్టే మీకు అర్ధం కాలేదు. అందుకే వక్రీకరించి మట్లాడారు.
• వాడుకుని వదిలేయడంలో ముఖ్యమంత్రి నేర్పరి
ఒక పెళ్లి చేసుకుని 30 మంది స్టెఫ్నీలతో ఉంటే పర్లేదా అంటే మీరేందుకు ఉలిక్కిపడ్డారు. ఆయన మాట్లాడింది రాష్ట్ర ప్రజలు మొత్తం విన్నారు. దాన్ని వక్రీకరించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్లు చేసుకోమన్నారు. సమాజానికి మీరిచ్చే సందేశం ఇదేనా అంటూ ఇష్టారాజ్యంగా కూశారు.. మీ చెల్లి షర్మిళ గారిని ఈ రాష్ట్రం నుంచే గెంటేశారు. ఇదేనా మీరిచ్చే సంకేతం. కన్నతల్లి చేత గౌరవాధ్యక్షురాలి పదవికి బలవంతంగా రాజీనామా చేయించారు. ఆమెను కూడా పక్క రాష్ట్రానికి గెంటేశారు. ఇదేనా మీరిచ్చే సందేశం.. మీ ఇబ్బందుల్లో పాలు పంచుకున్న తల్,లిచెల్లిని పక్క రాష్ట్రాలకు సాగనంపిన సంస్కృతి మీ దగ్గర నుంచి ప్రజలు ఎక్కడ నేర్చుకుంటారన్న భయం కలుగుతోంది. వాడుకుని వదిలేయడం మీరు నేర్పినంత బాగా ప్రపంచంలో ఎవరూ నేర్పలేరు.
• మహిళా ద్రోహి శ్రీ జగన్ రెడ్డి
రాష్ట్రంలో ఏ మహిళ మీదన్నా అఘాయిత్యం జరిగితే మీరు స్పందించారా? ఒక్కరి ఘటన మీదైనా మీరు స్పందించారా? మూడేళ్లలో 1500 అఘాయిత్యాలు మహిళల మీద జరిగితే ఒక్క సంఘటన మీదైనా స్పందించారా? ఏప్రిల్, మే,జూన్ మాసాల్లో 160 ఘటనలు మహిళల మీద జరిగితే ఒక్క ఘటన మీద స్పందించారా? స్పందించకపోగా మీ మంత్రి తానేటి వనిత గారు మహిళలు అఘాయిత్యానికి గురైతే అది తల్లిదండ్రుల తప్పు అని శెలవిచ్చారు. ఇదా మీరు సభ్య సమాజానికి ఇచ్చే సందేశం. అప్పుడు మీ నోరేమయ్యింది. అప్పుడు సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినట్టా..
• దసపల్లా భూములు రసగుల్లాల్లా మింగేశారు
శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రజా సమస్యల గురించి మాత్రమే పోరాటం చేస్తున్నారు. మీరు పెట్టుబడిదారుల కోసం పని చేస్తున్నారు. పేదల కోసం పోరాటం చేసేందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనవాణి నిర్వహిస్తున్నారు. కౌలు రైతులకు అండగా నిలబడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం ఇసుక పాలసీ మార్చమని పోరాడారు. రోడ్లు బాగు చేయమని ఉద్యమం చేశారు. నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని పోరాటం చేశారు. మీరేం చేశారు రుషికొండను దోచేయడం.. దస్పల్లా భూములు రసగుల్లాలా మింగేయడం..అమరావతి భూముల్ని మీ మంత్రులు ఎమ్మెల్యేలకు పంచిపెట్టడం.. శ్రీ విజయసాయిరెడ్డి కూతురుకో, అల్లుడికో విశాఖ భూములు కట్టబెట్టడం, స్టీల్ ప్లాంట్ కొట్టేయడం. ఆఖరికి కడపలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఉంటే ఇసుక కోసం వందల మందిని చంపేసిన సంస్కృతి మీది. మీ సొంత నియోజకవర్గం పులివెందులలో 46 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోని దుర్మార్గుడైన పాలకుడు శ్రీ జగన్ రెడ్డి .. నిత్యం ప్రజల కోసం. రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకీ మీకు పోలికెక్కడ.. పేద ప్రజల సంక్షేమం కోసం పోరాడుతున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకి మంచి చేయాలి ఆదుకోవాలి. కౌలు రైతులకు అండగా నిలబడాలి. అత్యాచారం చేసిన నింధితుల్ని కఠినంగా శిక్షించాలంటే అది మీకు వినబడదు. మీ తాడేపల్లి ప్యాలెస్ కి కూత వేటు దూరంలో అఘాయిత్యం జరిగితే స్పందించలేని దుర్మార్గ పాలకుడు.. మహిళా ద్రోహి శ్రీ జగన్ రెడ్డి. జగన్ రెడ్డి గారికి చెవులు పోవడం వల్లే శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు.
• మీ సామాజిక న్యాయం ఇదేనా?
మాట్లాడితే సామాజిక న్యాయం చేశామని చెబుతున్నారు. మీ సొంత సామాజికవర్గానికి 650 నామినేటెడ్ పోస్టులు ఇచ్చుకోవడం సామాజిక న్యాయమా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల సబ్ ప్లాన్ నిధులు పక్కదోవ పట్టించడం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం బీసీ రిజర్వేషన్లు తీసేయడం.. విదేశీ విద్యా పథకం, వివాహ కానుక తీసేయడం సామాజిక న్యాయమా? నిన్నటికి నిన్న శ్రీ జగన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నామినేటెడ్ పదవితో పాటు కారు కొనుక్కోవడానికి రూ. 20 లక్షలు ఇచ్చారు. ఇదేనా సామాజిక న్యాయం అంటే. దాని గురించి శ్రీ జగన్ రెడ్డి మట్లాడాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు అవకాకులు, చవాకులు పేలితే తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పులు చూపడం కాదు.. చెప్పులు కొరియర్ లో పంపుతామని హెచ్చరిస్తున్నాం” అన్నారు.