• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

పేదరికం నిర్మూలనలో జగన్ ప్రభుత్వం టాప్

admin by admin
July 22, 2023
in politics
0 0
0
పేదరికం నిర్మూలనలో జగన్ ప్రభుత్వం టాప్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి

పేదరిక నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ దూసుకు పోతోంది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న సంస్కరణల ఫలతం ఇప్పుడు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని నీతి అయోగ్ తేల్చింది. మనసున్న ప్రభుత్వం ఉంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి అని నిరూపించింది జగన్ మోహన్ రెడ్డి ప్రభత్వం. పాలన అంటే అధికారం అనుకునే ఇదివరకటి పాలకులకు భిన్నంగా… పాలన అంటే బాధ్యత అని కొత్త నిర్వచనం చెప్పి ముందడుగు వేసిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి … తన ఆలోచన వల్ల నేడు మంచి ఫలితాలను సాధిస్తోంది. అభివృద్ధి అంటే రోడ్లు.. భవనాలు.. ప్రాజెక్టులు అనేది ఇదివరకటి పాలకుల భావన. కానీ దేశమంటే మట్టికాదోయ్ .. దేశమంటే మనుషులోయ్ అని ప్రవచించిన గురజాడ అడుగుజాడల్లో నడుస్తూ మన రాష్ట్రంలోని ప్రజల అభివృద్దే… రాష్ట్రాభివృద్ధి అని సరికొత్త నినాదం ఇచ్చారు.

అందుకే రాష్ట్రమంతా పేదలే ఉంటే బిల్డింగులు నిర్మించి రోడ్లు వేసేస్తే ప్రయోజనం ఏముంది. ముందు రాష్ట్ర ప్రజలను పేదరికం నుంచి వేరు చేయాలి.. పేదరికం తగ్గాలి అనే సంకల్పంతో నాలుగేళ్లుగా పాలన సాగించిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. నా పేదలు.. … నా బీసీలు.. నా ఎస్సిలు.. నా ఎస్టీలు అని తరచూ కలవరించే జగన్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. వారి జీవితాలను పేదరికానికి దూరంగా జరిపి వారి ఇళ్లలో వెలుగులు.. కళ్ళలో దీపపు కాంతులు నింపారు..

సొంత డబ్బా కాదు.. కేంద్రం చెబుతున్న వాస్తవాలివి

మనగురించి మనం చెప్పుకోవడం.. మన జబ్బలు మనం చరుచుకోవడం.. ఎంతముద్దుగా ఉన్నానో అంటూ మన చెంపలు మనం ముద్దాడుకోవడం కాదు .. పక్కోళ్లు.. ఇరుగుపొరుగోళ్ళు.. కుదిరితే పక్కూరి వాళ్ళు.. పక్కజిల్లావాళ్ళు పొగడాలి. ఇలా మన పనితనం ఎల్లలు దాటాలి. పేదల సంక్షేమం.. పేదరిక నిర్మూలన కోసం అహోరాత్రులు కృషిచేస్తున్న జగన్ మోహన్ రెడ్డి కష్టానికి ప్రతిఫలం వచ్చింది. నాలుగేళ్ళ క్రిందట ఆయనవేసిన సంక్షేమ మొలకలు మొక్కలయ్యాయి.. చెట్లయ్యాయి.. కాపు కాస్తున్నాయి.. పేదల ఇళ్లలో పూలు.. పళ్ళు ఇస్తున్నాయి. 2016లో ఆంధ్రాలో పేదరికం 11.7 శాతం ఉండగా 2021 నాటికి అది 6.06 శాతానికి తగ్గింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2016 నాటికి 14.72 శాతం పేదరికం ఉండగా అది 2021 నాటికి 7.71 శాతానికి తగ్గిందని అదే సమయంలో పట్టణ ప్రాంత పేదరికం 4.63 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గినట్లు కేంద్రప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వెల్లడించింది.

సంక్షేమ పథకాలే పహారా సైనికులు

రాష్ట్రంలో జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలపాలిట కావలికోటలుగా నిలిచాయి. ఈ పథకాలను దాటుకుని పేదరికం ప్రజల ఇళ్లలోకి చొరబడడం అసాధ్యం అవుతోంది. ఉచిత విద్య, వైద్యం. రైతులకు భరోసా.. బాలలకు పౌస్టికాహారం.. గర్భిణులకు ఇచ్చే ప్రత్యేక ఆహారం వంటివి ప్రజలకి ఎంతగానో మేలు చేశాయి. ఇలా ఏ వర్గాన్నీ వదలకుండా సంక్షేమ పథకాలు అనే రాతి గోడను నిర్మించిన జగన్ ఆ గోడ దాటి పేదరికం ఆయా ఇళ్లలోకి రావడానికి అవకాశం ఇవ్వడం లేదు.

ఇల్లు దాటి కదల్లేని వృద్ధులకు సైతం ఇళ్లకే పెన్షన్లు… ఇంటి ముంగిటకు ఆరోగ్య సేవలు అందిస్తూ పేదరికపు కాటు నుంచి ప్రజల్ని కాపాడే సైనికుడి బాధ్యత జగనన్న తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో పేదరికపు ఛాయలు తగ్గుతూ వస్తున్నాయని. ప్రజలు సంక్షేమ రాజ్యంలో సుభిక్షంగా ఉంటూ పోషకాహారం తీసుకుంటూ ఉన్నత జీవన ప్రమాణాల్లో పొందుతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది.

Previous Post

పేదరికం తగ్గుతోంది… నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి

Next Post

తెలుగు స్టాప్ మొబైల్ యాప్ విడుదల

Next Post
తెలుగు స్టాప్ మొబైల్ యాప్ విడుదల

తెలుగు స్టాప్ మొబైల్ యాప్ విడుదల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…
movies

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

by admin
May 31, 2026
0

...

Read more
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

నటుడు Sanjosh సేవా కార్యక్రమాలకు ప్రశంసలు

May 19, 2026
ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

ఘనంగా ‘క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ’ కర్టెన్ రైజర్ ఈవెంట్

May 16, 2026
తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా అండ్ ఓటిటి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆఫ్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ” వాగ్దేవి అవార్డ్స్ ప్రదానం”

May 11, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In