రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతల అక్రమ చొరబాట్లపై రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి , శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ , మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ కలిసిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని,వైఎస్సార్సీపీకి ఓట్లు వేసిన దళితులపై కూడా దాడులు చేస్తున్నారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గాలేదన్నారు.
రాష్ట్రంలో శాంతి భదత్రలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హితవు పలికారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జరుగుతున్నాయన్నారు. వైఎస్సార్సీపీ దాడులు ఆఫీసుల నిర్మాణాలపై తప్పుడు ప్రచారంచేస్తున్నారని మండిపడ్డారు.