బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్కంద’-ది ఎటాకర్.. గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు.. ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అంచనాలను పెంచింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో డోస్ పెంచారు. ఈ రోజు, గణేష్ చతుర్థి సందర్భంగా, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కల్ట్ మామా పాటను విడుదల చేసారు.
కల్ట్ మామా ని సాలిడ్ బీట్‌లతో హైలీ మాస్ ఎనర్జిటిక్ పాటగా కంపోజ్ చేశారు ఎస్ఎస్ తమన్. ట్యూన్‌కి కమాండింగ్ బేస్ ఉంది. అనంత శ్రీరామ్ సాహిత్యం హీరో సత్తాను చాటింది. పాట రిథమ్, ఆర్కెస్ట్రా మాస్ ఎనర్జీని నింపాయి.
కల్ట్ మామాని రమ్య బెహెరా, మహాతో కలిసి హేమ చంద్ర పాడారు. వారి వోకల్స్ పాట ఎనర్జీని పెంచాయి. ఈ పాట మన కల్ట్ మోడ్‌ని యాక్టివేట్ చేసి మ్యాడ్ మేనియాను ఎంజాయ్ చేసేలా వుంది. రామ్ పోతినేని మాసీవ్ ఎనర్జీ బిగ్గెస్ట్ స్ట్రెంత్. రామ్ పూర్తిగా రగ్గడ్ అవతార్‌లో కనిపించారు. అతని ఎక్స్ టార్డినరీ డ్యాన్స్ మూమెంట్స్ విజువల్స్‌కు అందాన్ని జోడించాయి. ఊర్వశి రౌతేలా సిజ్లింగ్ షో మరో ఆకర్షణ.
ఈ సాంగ్ తన చుట్టూ ఉన్న హైప్‌ని అందుకొని సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం రామ్‌కు ఎక్స్ పెన్సీవ్ మూవీ. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
సంతోష్ డిటాకే సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఎడిటర్ తమ్మిరాజు.
స్కంద సెప్టెంబర్ 28న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది.
తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్, తదితరులు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్
సంగీతం: ఎస్ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు
#Skanda