లక్ష్య సంకల్పం ట్రస్ట్ ఆధ్వర్యంలో లక్డీకాపూల్‌లోని నీలోఫర్ ఆస్పత్రి వద్ద సోమవారం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ అగ్రికల్చర్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, నాంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఫిరోజ్‌ఖాన్ ముఖ్య అతిథులుగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ట్రస్ట్ నిర్వాహకులు ఎం.రాజశేఖర్‌రెడ్డి, ఎం. సాధన రెడ్డి మాట్లాడుతూ లక్ష్య సంకల్ప ఆధ్వర్యంలో ఇక నుంచి ప్రతి వారం నగరంలోని నిమ్స్, బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల వద్ద సైతం రోగులు, వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ ఎం. సంగారెడ్డి, జయంతి కేశగల్లా తదితరులు పాల్గొన్నారు.