• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రామ్ పోతినేని విడుదల చేసిన ‘దీపావళి’ ట్రైలర్

admin by admin
October 26, 2023
in movies
0 0
0
రామ్ పోతినేని విడుదల చేసిన ‘దీపావళి’ ట్రైలర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అనగనగా ఓ మేక. దాని పేరు అబ్బులు! దేవుడికి మొక్కుకున్న మేక అది. ఆ మేక అంటే ఇంట్లో చిన్న పిల్లాడు గణేష్‌కు ప్రాణం. దాని తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళడు. అయితే… దీపావళికి కొత్త డ్రస్ వేసుకోవాలనే గణేష్ ఆశ మేకకు ముప్పు తిప్పలు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఏమైందనేది తెలుసుకోవాలంటే ‘దీపావళి’ సినిమా చూడాలి.

ప్రముఖ నిర్మాత, శ్రీ స్రవంతి మూవీస్ అధినేత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘దీపావళి’. కృష్ణ చైతన్య చిత్ర సమర్పకులు. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్ ప్రధాన పాత్రధారులు. ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’కు తెలుగు అనువాదం ఈ ‘దీపావళి’. ఈ సినిమా పలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ప్రశంసలు అందుకుంది. నవంబర్ 11న తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ రోజు ఉస్తాద్ రామ్ పోతినేని ట్విట్టర్ ద్వారా ట్రైలర్ విడుదల చేశారు.

పల్లెటూరి నేపథ్యంలో ‘దీపావళి’ తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే… పల్లెలో పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను సహజంగా ఆవిష్కరించారు. తాత, మనవడు, మేక మధ్య బంధాన్ని బలంగా చూపించారు. దీపావళి పండక్కి కొత్త డ్రస్ కొని ఇవ్వమని మనవడు అడగడంతో మేకను అమ్మడానికి తాతయ్య సిద్ధపడతాడు. మొక్కుబడి మేక కావడంతో ఊరి జనాలు దానిని కొనడానికి ముందుకు రారు. అయితే… కొత్తగా మటన్ షాప్ పెట్టుకోవాలని వీరబాబు ఆ మేక కొనడానికి రెడీ అవుతాడు. ఆ తర్వాత మేకను మరొకరు దొంగతనం చేస్తారు. తర్వాత ఏమైందనేది వెండితెరపై చూడాలి. మేకకు ప్రముఖ హాస్య నటుడు, కథానాయకుడు సప్తగిరి వాయిస్ ఇచ్చారు.

చిత్ర నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 11న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. నేటివిటీకి పెద్దపీట వేస్తూ తీసిన చిత్రమిది. ప్రతి ఫ్రేములో సహజత్వం కనపడుతుంది. తాతయ్య, మనవడు, మేక మధ్య అనుబంధం… వాళ్ళ భావోద్వేగం… ప్రేక్షకులందరి హృదయాలను కదిలిస్తుంది. ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకులను మన్ననలు అందుకునే చిత్రమిది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా త్వరలో తెలుగు, తమిళ పాటలు విడుదల చేస్తాం” అని చెప్పారు.

పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆడియోగ్రాఫర్: తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ : కె.బి. నందు, లిరిసిస్ట్ : రాంబాబు గోసాల, ఎడిటర్ : ఆనంద్ గెర్లడిన్, సంగీతం : థీసన్, సినిమాటోగ్రఫీ : ఎం. జయప్రకాశ్, సమర్పణ : కృష్ణ చైతన్య, నిర్మాత : స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: ఆర్ఏ వెంకట్.

Previous Post

యంగ్ హీరో రాజ్ దాసిరెడ్డితో ద్విభాషా చిత్రం కోసం సన్నాహాలు

Next Post

తొలి ప్రయత్నమే భారీగా..! డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ “మహర్ యోధ్ 1818” సినిమా ప్రారంభం

Next Post
తొలి ప్రయత్నమే భారీగా..! డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ “మహర్ యోధ్ 1818” సినిమా ప్రారంభం

తొలి ప్రయత్నమే భారీగా..! డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ "మహర్ యోధ్ 1818" సినిమా ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్
movies

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

by admin
September 6, 2026
0

...

Read more
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

September 4, 2026
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In