నూతన సంవత్సరం సందర్భంగా టి.పి.సి.సి. వర్కింగ్ ప్రెసిడెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మహ్మద్ అజారుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్కలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కాసేపు సెక్రటేరియట్ లో మంత్రులతో కలసి సందడిగ ముచ్చటించారు. సీఎంను, మంత్రులను కలిసిన వారిలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ ఫహీం, కాంగ్రెస్ నేత అసదుద్దీన్ కూడా ఉన్నారు. ఈ సదర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ… ఈ కొత్త సంవత్సరంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తెలంగాణాలో అత్యధిక ఎంపీ సీట్లను గెలిచి… కేంద్రంలో రాహుల్ నాయకత్వంలో చాలా బలమైన ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేస్తాం అన్నారు.