అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విజయవాడలో ప్రారంభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏడుగురు అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించింది. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ తదితర అంశాలపై నివేదికల ఆధారంగా సమీక్షించారు. ఈ సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించిన 2024 ఓటర్ల జాబితా రూపకల్పనపై సమీక్ష సమావేశంలో పలు జిల్లా కలెక్టర్ లు, ఎస్పీ లు పాల్గొన్నారు. ఈ సమీక్షలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై ఈసీ బృందం సమీక్షించడం జరిగింది. జిల్లాలవారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై కమిషన్ బృందానికి వివరించారు.