అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. కళ్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఉమా పలువురు తెదేపా శ్రేణులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ పలు సందర్భాల్లో వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అధికారులతో కలిసి వేలాది మందిని పోగుచేసి కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమావేశాలు నిర్వహించారని, అయితే వినాయక ఉత్సవాలు నిర్వహించడానికి మాత్రం కౌడ్ నిబంధనలు వస్తున్నాయని వినాయక మండపాలు ఏర్పాటు కు అనుమతులు రద్దు చేయటం శోచనీయమన్నారు. వేలాది మంది గుమిగూడితే రాని కరోనా వందల సంఖ్యలో వినాయక మండపం వద్ద చేరితే సోకుతుందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వినాయక మండపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.