ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి రోజుకి పెరుగుతుంది. రెండు పార్టీలు బలాబలాలు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి చిన్న ఈవెంట్ ని పబ్లిసిటీ కోసం వాడుకోవడానికి టిడిపి తెగ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ ఆఫీసు ముందు వ్యూహం పోస్టర్లను తగలబెట్టి నానా హడావిడి చేశారు. తీరా పోలీసులు వచ్చే సమయానికి తోక ముడుచుకుని పారిపోయారు.
వివరాల్లోకి వెళ్తే రాంగోపాల్ వర్మ ఎన్నికల వేడిని మరింత పెంచడానికి వ్యూహం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ దివంగత నేత అష్ట మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి పదవిలోకి వచ్చేటంతవరకు ఎదుర్కొన్నటువంటి అనేక సంఘటనలను నిక్షిప్తం చేశారు. అలాగే తండ్రి మరణానంతరం జగన్ ఎలా ఒంటరి పోరాటం చేశారు పదవిలోకి ఎలా వచ్చారో కూడా వివరిస్తూ నెక్స్ట్ పార్ట్ రెడీ చేస్తున్నారు.
నిజానికి ఈ చిత్రం ఈనెల మొదట్లోనే విడుదల కావాల్సి ఉంది .కానీ సెన్సార్ పన్నుల కారణంగా జనవరి 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ చిత్రంలో తనని, తన కుటుంబాన్ని ,తన పార్టీని కించపరిచే విధంగా చిత్రీకరించారు అని నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో ప్రస్తుతం ఈ మూవీ విడుదల సస్పెన్స్ గా మారింది. ఈ నేపథ్యంలో కొందరు టిడిపి కార్యకర్తలు ఆర్జీవి డన్ దగ్గర.. వ్యూహం పోస్టర్లను కాల్చి గందరగోళం సృష్టించారు. ఇలా టిడిపి కార్యకర్తలు గుండాయిజంకు కూడా పాల్పడడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.