టాలెంటెడ్ యాక్టర్ వెంకట్ చేతుల మీదుగా ‘రుద్రాక్షపురం’ టీజర్ విడుదల
ధీక్షిక సమర్పణలో మ్యాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ రేఖ తారాగణంగా.. ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఓరియంటెడ్ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ తాజాగా టీజర్‌ని విడుదల చేశారు. టాలెంటెడ్ యాక్టర్ వెంకట్ ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
టీజర్‌లో.. ‘ఏదో సాధించాలని వెళుతున్నారు.. అనుకోకుండా చావు ఎదురైంది. భయంతో పరుగులు తీస్తే అది వెంటపడింది. చస్తే సమాధికి, బతికితే ఇంటికి.. తిరగబడితే జయం నిశ్చయం అయింది. జయం నిశ్చయం’ అంటూ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌లో టీజర్ నడవగా.. ఆ వాయిస్‌కి అనుగుణంగా అదిరిపోయే యాక్షన్‌తో ఈ టీజర్ ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌కి కావాల్సిన కంటెంట్ ఇందులో పుష్కలంగా ఉందనేలా టీజర్‌ని కట్ చేశారు.
ఈ టీజర్ విడుదల చేసిన అనంతరం హీరో వెంకట్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన మణి సాయితేజకు, పవన్ వర్మకు, డైరెక్టర్ ఆర్.కె.గాంధీగారికి, మీడియా సూపర్ హీరోస్ సురేష్ కొండేటి, వీరబాబు, అప్పాజీగార్లకి.. ఇంకా చిత్రయూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు. టీజర్ చూశాను. చాలా బాగుంది. మంచి యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ ఇదని అనిపించింది. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూసి విజయవంతం చేయండి. మరొక్కసారి నా బెస్ట్ విశెష్‌ని చిత్రయూనిట్‌కి తెలియజేస్తున్నానని అన్నారు.
చిత్ర దర్శకుడు ఆర్.కె. గాంధీ మాట్లాడుతూ.. ‘‘మా ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించిన హీరో వెంకట్‌గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఆయన కూడా ఓ మెయిన్ రోల్ చేయాల్సి ఉంది. కానీ.. ఆయన బిజీగా ఉండటం కారణంగా కుదరలేదు. ఆయన చేయాల్సిన పాత్రని సురేష్ కొండేటిగారు చేశారు. ఇప్పుడు వెంకట్‌గారి చేతులు మీదుగా ఈ టీజర్ విడుదలవడం చాలా సంతోషంగా ఉంది. జూన్ 23న సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రమోషన్స్ కోసం సాంగ్స్, ట్రైలర్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఈ సినిమాని థియేటర్లలో చూసి.. ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.
‘సంతోషం’ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమా అప్పటి నుంచి వెంకట్‌తో మంచి పరిచయం ఉంది. మా ఫ్యామిలీకి ఫ్రెండ్. అలాంటిది వెంకట్‌గారు చేయాల్సిన పోలీస్ ఆఫీసర్ పాత్ర నాకు రావడం చాలా అదృష్టంగా ఫీలవుతున్నాను. దర్శకుడు గాంధీ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన నన్ను కలిసి ఇలా పాత్ర చేయాలి అని అడగగానే.. ముందు గెటప్ చూద్దాం.. బాగుంటే తప్పకుండా చేస్తానని చెప్పాను. గెటప్ ఓకే అవడంతో.. ఈ సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాను. వెంకట్‌గారు చేయాల్సిన పాత్ర అంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలిసిందే. ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం చాలా సంతోషంగా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.
పీఆర్వో ధీరజ్ అప్పాజీ మాట్లాడుతూ.. అతి త్వరలో అగ్ర దర్శకుడయ్యే లక్షణాలు దర్శకుడు గాంధీలో ఉన్నాయి. అతని దర్శకత్వంలో వెంకట్ హీరోగా ఓ సినిమా ఉండబోతుంది. ఇక ‘రుద్రాక్షపురం 3కి.మీ’ విషయానికి వస్తే.. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న నిర్మాత ఉపేందర్‌గారి అబ్బాయికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.
పీఆర్వో వీరబాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకో మంచి పాత్రని ఇచ్చిన గాంధీగారికి, నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.
చిత్ర హీరో సాయి మణితేజ మాట్లాడుతూ.. టీజర్ విడుదల చేసిన వెంకట్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో అనుకోకుండా నేను హీరోగా చేయడం జరిగింది. ఫస్ట్ లుక్‌ని ప్రకాశ్ రాజ్‌గారు విడుదల చేసిన తర్వాత.. హీరో ఇంకా ఫైనల్ కాలేదు. అప్పుడు నేను దర్శకుడు గాంధీగారికి కనిపించడంతో.. ఆయన ఈ సినిమాలో హీరో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. చాలా మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేసిన దర్శకుడు గాంధీగారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. మరో నటుడు పవన్ వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాత కొండ్రాసి ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసిన వెంకట్‌గారికి ధన్యవాదాలు. ఆయనతో నాకు తెలియని బంధం ఉంది. నా మ్యారేజ్ అయిన కొత్తలో నా భార్యతో కలిసి చూసిన మొట్టమొదటి చిత్రం ఆయన నటించిన చిత్రమే. అందుకే ఆయనలానే నా బిడ్డని హీరోని చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నా కుమారుడిని హీరోగా ఈ సినిమాతో పరిచయం చేయడం, చిత్ర టీజర్‌ని వెంకట్‌గారు విడుదల చేయడం.. దైవ సంకల్పంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం గాంధీగారు చాలా కష్టపడ్డారు. మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. నేను ఆల్రెడీ సినిమా చూశాను. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.
మణి సాయితేజ, పవన్ వర్మ, వైడూర్య, రేఖ, వీరబాబు, నాగమహేశ్, ధీరజ్ అప్పాజీ, సురేష్ కొండేటి, శ్రీవాణి, సునంద, అజయ్ రాహుల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: ఎం. నాగేంద్ర కుమార్
సంగీతం: గంటాడి కృష్ణ, ఎమ్.ఎల్. రాజా జయసూర్య బొంపెం
పాటలు: జయసూర్య బొంపెం ,ఎం ఎల్ రాజ, గంటాడి కృష్ణ
స్టంట్స్: బాజి, స్టార్ మల్లి, థ్రిల్లర్ మంజు
ఎడిటింగ్: డి. మల్లి
పీఆర్వో: వీరబాబు,
నిర్మాతలు: కొండ్రాసి ఉపేందర్,
కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: ఆర్.కె. గాంధీ
Talented Actor Venkat Released The Teaser Of ‘Rudrakshapuram’
Presented by Dhikshika, Produced under MackWood Entertainments Banner starring Sai Mani Teja, Vaidhurya, Pavan Varma, and Rekha, Directed by RK Gandhi, Bankrolled by Kondrasi Upender is titled ‘Rudrakshapuram 3 K.M.’ Touted to be an out and out action-oriented film, the movie has completed its post-production works and is getting ready for its release. As a part of promotions, makers released the teaser of the film. Talented actor Venkat unveiled the teaser and wished the team very good success.
The teaser runs with a haunting voiceover in the background with dialogue, ” Edo Saadhinchalaani Velutunnaaru. Anukokunda Chaavu Edurayyindi. Bhayamtho Parugulu Teeste Adi Venta Padindi. Chaste Samadhiki… Brathikite Intiki… Tiragabadite Jayam Nischayam Ayindi… Jayam Niscbayam” The dialogue is uttered powerfully and it is equally complimented with terrific action in the teaser. The teaser was cut giving a strong impression that the film has the i