• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

శ్రీ రంగాపురం… మాస్ ఎంటర్టైనర్

admin by admin
September 9, 2022
in movies
0 0
0
శ్రీ రంగాపురం… మాస్ ఎంటర్టైనర్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన కథలని ఆడియెన్స్ బాగా ఆదరిస్తారు. అందుకే కొత్త నిర్మాతలు, దర్శకులు ఇలాంటి కథలని ఎంచుకొని సక్సెస్ సాధిస్తుంటారు. తాజాగా చిందనూరు నాగరాజు అనే నిర్మాత కొత్త నటీనటులతో శ్రీ రంగాపురం అనే గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాని నిర్మించారు. తన శ్రీ సాయి లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై చిందనూరు విజయలక్ష్మి సమర్పణలో ఈ సినిమాని నిర్మించారు. ఇందులో నూతన హీరో హీరోయిన్స్ వినాయక్ దేశాయ్, పాయెల్ ముఖర్జీ నటించగా… చిత్ర నిర్మాత చిందనూరు నాగరాజు ఓ ముఖ్య పాత్రలో నటించారు. ఎం. ఎస్ వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రం… ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా ఉందో చూద్దాం పదండి.

కథ: శ్రీరంగాపురం గ్రామంలో పెద్దరెడ్డి (చిందనూరు నాగరాజు), కొండారెడ్డి(సత్య ప్రకాశ్) ల మధ్య పగ, ప్రతీకారాలు వుంటాయి. ఓ సారి గ్రామం విషయంలో కొండారెడ్డి ని.. పెద్దరెడ్డి ఘోరంగా అవమానిస్తాడు. దాంతో కొండారెడ్డి వూరికి దూరంగా నివసిస్తూ వుంటాడు. అయితే పెద్దిరెడ్డి.. తన మేనకోడలు మహాలక్ష్మి(పాయెల్ ముఖర్జీ)ని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతాడు. ఆమె అదే గ్రామానికి చెందిన పాలు అమ్ముకునే రంగ(వినాయక్ దేశాయ్) అనే యువకున్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో కొండారెడ్డి కుమారుడు సిద్ధూ (రోబో గణేశ్) మహాలక్ష్మిని ఇష్టపడతాడు. ఈ విషయం తెలిసి పెద్దరెడ్డి… పాలమ్ముకునే రంగకి తన మెనకోడలిని ఇవ్వడం కంటే తన కులానికి చెందిన.. పగవాడైన కొండారెడ్డి కుమారునికి ఇచ్చి పెళ్లి చేయడం వుత్తమం అని భావించి… కొండారెడ్డి ఇంటికి కోడలిని చేస్తాను అని మాటిస్తాడు. మరి పెద్దరెడ్డి … కొండారెడ్డి కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? మహాలక్ష్మి, రంగాల ప్రేమ ఎలా ముగిసింది తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

కథ.. కథనం విశ్లేషణ: గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కే కథలు ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. గ్రామాల్లో రెండు వర్గాల మధ్య వుండే పగలు, ప్రతీకారాలు… వాటి మధ్యలో ఓ అందమైన ప్రేమ కథ… ఆ ప్రేమ కథకు అడ్డు తగిలే విలన్… ఇలా ఇంట్రెస్టింగ్ కథ. కథనాలతో వచ్చే సినిమాలని ఆడియన్స్ బాగా ఆదరిస్తారు. తాజాగా ఎం.యస్. వాసు దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీరంగాపురం చిత్రం కూడా ఇలాంటి గ్రామీణ నేపథ్యం ఉన్న స్టోరీతో తెరకెక్కిందే. తండ్రి తరువాత తండ్రి లాంటి వాడు మేన మామ. అలాంటి మేనమామ తన మేనకోడలు ప్రేమ విషయంలో ఎలా వ్యవహరించాడు.. ఆమె ప్రేమను గెలిపించడానికి, తాను ఇతరులకు ఇచ్చిన మాటకు ఎలా కట్టుబడి వున్నాడు అనేది ఇందులో ఎంతో హృద్యంగా చూపించారు దర్శకుడు. ప్రతి మేన మామ తన మేనకోడలు పట్ల ఎలా వుండాలి అనేది ఓ మెసేజ్ కూడా ఇచ్చాడు. సెంటిమెంట్, మాస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రంతో నూతనంగా పరిచయమైన హీరో వినాయక్ దేశాయ్.. మంచి మాస్ కటౌట్ వున్నొడు. ఇందులో అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రేమ కథకి చక్కగా సూట్ అయ్యాడు. అతనికి జంటగా నటించిన పాయెల్ ముఖర్జీ గ్రామీణ యువతిగా లంగా ఓణీ లో మెప్పించింది. అలాగే యూత్ కి నచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ లోనూ బాగా ఆకట్టుకుంది. ఇద్దరికీ ఇదే తొలి సినిమా. మేన మామ గా పెద్దరెడ్డి పాత్రలో ఈ సినిమా నిర్మాత చిందనూరు నాగరాజు మాస్ సీన్స్ లో బాగా ఆకట్టుకున్నాడు. అలాగే అతడు చేసిన మాస్ యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కూతురులా తన మేనకోడలిని ఎంతో ప్రేమించే మేన మామ గా… గ్రామంలో ప్రత్యర్థులకు సింహ స్వప్నంలా కనిపించి మెప్పించాడు. రెండు వేరియేషన్స్ లో బాగా అనుభవం వున్న నటుడిగా నటించాడు. విలన్ పాత్రలో సత్య ప్రకాశ్ తన దైన స్టైల్లో నటించాడు. అతని కొడుకుగా రోబో గణేశ్ సైకో పాత్రలో మెప్పించాడు. మిగతా పాత్రలలో చిత్రం శ్రీను, జబర్దస్త్ రాజమౌళి, శ్రావణ సంధ్య, వైష్ణవి సింగ్, గీతా సింగ్, దుర్గారావు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

దర్శకుడు వాసు రాసుకున్న కథ.. కథనాలు బాగున్నాయి. మాస్ ని మెప్పించే అన్ని అంశాలు ఇందులో వుండేలా చిత్రీకరించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. గ్రామీణ వాతావరణాన్ని చక్కగ చూపించారు. అలాగే హీరో, హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ ని బాగా క్యాప్చర్ చేశారు. పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకాస్త బాగుందాల్సింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు క్వాలిటీగా వున్నాయి. గో అండ్ వాచ్ ఇట్.

రేటింగ్: 3.25

Previous Post

అడియన్స్ అందరూ ఈ సినిమా స్క్రిప్ట్ కు కనెక్ట్ అవుతారు- హీరో నివాస్ శిస్టు

Next Post

‘నెక్స్ట్ లెవల్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వి.ఎన్. ఆదిత్య

Next Post
‘నెక్స్ట్ లెవల్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వి.ఎన్. ఆదిత్య

‘నెక్స్ట్ లెవల్’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన వి.ఎన్. ఆదిత్య

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి
movies

WAPCON–2026: ఆయుర్వేదంతో మహిళా శక్తి

by admin
February 10, 2026
0

...

Read more
టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో ఘనంగా “నువ్వే ఉండిపో ఇలా”, “నువ్వేలే” పాటలు విడుదల

February 10, 2026
గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన  సినీ నటి మాళవిక మోహన్

గోయాజ్ సిల్వర్ జూవేలరీ షోరూంను ప్రారంభించిన సినీ నటి మాళవిక మోహన్

February 9, 2026
“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

“అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుద‌ల‌,

February 2, 2026
“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

“వన్ బై ఫోర్” (One/4) సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు- మూవీ మేకర్స్

February 2, 2026
ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

ఈ నెల 6వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న “దక్షిణ కాళీ” సినిమా

February 2, 2026
లగ్జరీ సిల్వర్ జువెలరీ  ‘గోయాజ్ (GOYAZ)’ –22వ  స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో  ప్రారంభం

లగ్జరీ సిల్వర్ జువెలరీ ‘గోయాజ్ (GOYAZ)’ –22వ స్టోర్ హైదరాబాద్ కొండాపూర్‌లో ప్రారంభం

February 1, 2026
వైభవంగా జరిగిన హీరో  సతీష్ జై కుమార్తె ‘నైరా ‘  పుట్టినరోజు వేడుక

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

January 29, 2026
సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

సునీత చేతుల మీదుగా బ్యాండ్ క్యాప్రిసియో చారిత్రక యూఎస్ఏ టూర్ 2026 పోస్టర్ ఆవిష్కరణ

January 22, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In