సుగి విజయ్, మౌనిక మగులూరి హీరో హీరోయిన్స్ గా నటించిన యూనిక్ హారర్ థ్రిల్లర్ ‘రా రాజా’. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్ పై బి. శివప్రసాద్ స్వీయా నిర్మాణ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. యూనిక్ కాన్సెప్ట్, ఎక్స్ ట్రార్డినరీ టేకింగ్, బ్రిలియంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ట్రైలర్ అదిరిపోయింది. క్యారెక్టర్ ఫేస్ ని రివిల్ చేయకుండా డిజైన్ చేసిన కాన్సెప్ట్ చాలా ఇంట్రస్టింగ్ వుంది. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ చాలా క్యురియాసైటీని పెంచాయి. రారాజా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది.
ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా రాహుల్ శ్రీవాత్సవ్ డీవోపీగా పని చేస్తున్నారు. ఉప్పు మారుతి ఎడిటర్ కాగ, రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ నందు మాస్టర్.
త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
బ్యానర్: శ్రీ పద్మిని సినిమాస్
తారాగణం : సుగి విజయ్, మౌనిక మగులూరి & ఇతరులు
నిర్మాత & దర్శకుడు: బి. శివప్రసాద్
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
ఎడిటర్: ఉప్పు మారుతి
డీవోపీ : రాహుల్ శ్రీవాత్సవ్
ఆర్ట్ డైరెక్టర్: రామాంజనేయులు
యాక్షన్: నందు మాస్టర్
పీఆర్వో : తేజస్వి సజ్జా
డిజిటల్: రెయిన్బో మీడియా