కొవాగ్జిన్ టీకా తీసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నటు నిర్ధారించిన శాస్త్రవేత్తలు. కొవాగ్జిన్ టీకాపై బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయన ఫలితాలను ‘స్ప్రింగర్ లింగ్’ జర్నల్‌లో ప్రచురించారు. అధ్యయనంలో భాగంగా కొవాగ్జిన్ టీకా తీసుకున్న 926 మందిపై అధ్యయనం నిర్వహించారు. ఏడాది పాటు సాగిన ఈ అధ్యయనంలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి.యవ్వనంలో ఉన్న వారిలో 48 శాతం మంది, పెద్దల్లో 43 శాతం మంది శ్వాసకోశ సమస్యకు గురైనట్టు తేలింది.టీకా తీసుకున్న ఏడాదిలోపు ఎడ్వెర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంటెరెస్ట్ (ఏఈఎస్ఐ) ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఏఈఎస్ఐ వచ్చిన వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్లు పడిపోవడం వంటివి జరుగుతాయి.. కొన్ని కేసుల్లో స్ట్రోక్ వంటి సమస్యలు కూడా వస్తాయని నిర్ధారించిన శాస్త్రవేత్తలు.