సిరి మూవీస్ బ్యానర్‌పై రమణ్ కథానాయకుడిగా కె.శిరీషా రమణా రెడ్డి నిర్మించిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’. ఎం.రమేష్, గోపి దర్శకత్వం వహించారు. ఇందులో ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష హీరోయిన్స్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ విలన్‌గా నటించారు. ఇటీవల హీరో శ్రీకాంత్ విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. లవ్… రొమాన్స్… యాక్షన్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా వుందో చూద్దాం పదండి.
కథ: ప్రతాప్ రెడ్డి(వినోద్ కుమార్) గ్రామంలో కులాంతర వివాహాలను కానీ, ప్రేమ వివాహాలను కానీ అసలు ఎంకరేజ్ చేయరు. అలా చేస్తే చంపి పాతిపెట్టే రకం ఆయన. తన పక్క గ్రామానికి చెందిన.శివ(రమణ్).ఊళ్ళో అల్లరి చిల్లరగా స్నేహితులతో సరదాగా తిరిగే ఓ గ్రామీణ యువకుడు. తండ్రి(జూనియర్ బాలకృష్ణ) ఎంత చెప్పినా డిగ్రీ కంప్లీట్ చేయకుండా అమ్మాయిల చుట్టూ ప్రేమ పేరుతో తిరుగుతూ ఉంటాడు.
అయితే తన క్లాస్ మేట్ అయిన సంధ్య(ప్రియాంక రౌరీ)ని ప్రేమిస్తాడు. ఈమె ప్రతాప్ రెడ్డి కూతురు. అసలే ప్రేమ పెళ్ళిళ్లకి, కులాంతర వివాహాలంటే రగిలిపోయే ప్రతాప్ రెడ్డి… వీరి వివాహానికి ఒప్పుకున్నాడా? అసలు సంధ్య… శివని నిజంగానే ప్రేమించిందా? శివ ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథనం విశ్లేషణ: కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. రొమాన్స్, యాక్షన్ పార్ట్ ని సరైన మోతాదులో వెండితెరపై చూపించగలిగితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్. అందుకే చాలా మంది నిర్మాతలు ఇలాంటి సబ్జెక్టుని ఎంచుకుని మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యే డెబ్యూ హీరోలు కూడా ఇలాంటి కథలనే సెలెక్ట్ చేసుకొని తమలోని టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. అలానే సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో మంచి దర్శకులుగా పేరు తెచ్చుకోవాలనుకునే వారూ ఇలాంటి కమర్షియల్ కథలను ఎంచుకుని విజయం సాధిస్తున్నారు. ఇలాంటి కొత్త టీమ్ యే.. ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ అనే ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమా విడుదలకు ముందే… టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సొంతం. చేసుకుంది. కులం, మతం కంటే… ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం గొప్ప మానవత్వం అని చాటి చెప్పే సినిమా ఇది. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో కులం పేరుతో ఆటవికంగా మనుషులను అంతమొదించడం…. నిమ్న కులాల వారిని అంటరాని వారిగా చూడటం చూస్తూనే ఉన్నాం. ఆలాంటి… సున్నితమైన సబ్జెక్టును తీసుకుని… వాటికి కమర్షియల్ విలువలు జోడించి… ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా సినిమాని తెరకెక్కించారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
నటీనటుల విషయానికి వస్తే… ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమైన హీరో రమణ్ చాలా మెచ్యూర్డ్ గా నటించారు. ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ తో ఆడియన్స్ ని ఎలా మెప్పించాలో.. అలా అలరించారు. పాటలు, ఫైట్స్, డైలాగ్స్ విషయంలో ఎక్కడా కొత్త కుర్రాడు అనే థాట్ రాకుండా చాలా ఎనర్జిటిక్ గా నటించారు. అలానే అందమైన ముద్దుగుమ్మలు నలుగురూ ప్రియాంక రౌరీ, పావని, అంకిత, వర్ష పోటీ పడి యూత్ ని ఆయకట్టు కున్నారు. సీనియర్ హీరో వినోద్ కుమార్ మరోసారి తన మార్కు నటన విలనిజంతో మెప్పించారు. రచ్చ రవి, జూనియర్ బాలకృష్ణ అండ్ బ్యాచ్ కామెడీ ప్రేక్షకులకు వినోదం పంచుతుంది. ముఖ్యంగా హీరో తండ్రి పాత్రలో జూనియర్ బాలకృష్ణ బాగా ఆకట్టుకున్నాడు.
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే… కమర్షియల్ ఎంటర్టైనర్ ని దర్శకులిద్దరూ ఎం. రమేష్, గోపి బాగా డీల్ చేశారు. ఒక డెబ్యూ హీరోని ప్రేక్షకులు మెచ్చేలా వెండితెరపై అన్ని విధాలుగా ఆవిష్కరించి సక్సెస్ అయ్యారు. సున్నితమైన కథను ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాంగా మలచడానికి ట్విస్టులతో రాసుకున్న స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. శ్రీవసంత్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఒకే. మహిత్ నారాయణ్ స్వరపరిచిన సంగీతం బాగుంది. ఎ.కె. ఆనంద్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. హీరో ఎలివేషన్… హీరోయిన్ల అందాలను యూత్ కి కనెక్ట్ అయ్యేలా కెమెరాలో బంధించారు. శ్రీనివాస్ పి. బాబు, సంజీవరెడ్డి ల ఎడిటింగ్ ఇంకాస్త కృస్పీగా ఉంటే బాగుండేది. అల్టిమేట్ శివ, కుంగ్‌ఫూ చంద్రు కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ మాస్ ని మెప్పిస్తాయి నిర్మాత కె.శిరీషా రమణారెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని ఎంతో ఉత్తమమైన నిర్మాణ విలువలతో నిర్మించారు. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3.25