ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా రౌద్ర రూపాయ నమః ఫస్ట్ సింగిల్ లాంచ్
`బాహుబలి` ప్రభాకర్ ప్రధాన పాత్రలో రావుల రమేష్ క్రియేషన్స్ పతాకంపై పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మిస్తోన్న చిత్రం `రౌద్ర రూపాయ నమః`. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ మరియు చిత్రంలోని మొదటి లిరికల్ వీడియోను ఈ రోజు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి లాంచ్ చేశారు.
“సుర సుర సుర అసురసురసుర … హర హర హర అతి భయంకరా…సర సర సర సర నెత్తురు దూకెరా… బిర బిర బిర బిర కత్తులు దూసెరా“ అంటూ సాగే ఈ పాటను సురేష్ గంగుల రచించగా జాన్ భూషణ్ స్వరపరిచారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు మార్కెట్ లోకి విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ…“ రౌద్ర రూపాయ నమః` టైటిల్ తో పాటు నేను లాంచ్ చేసిన `సుర సుర` అనే సాంగ్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. పాట చూసిన తర్వాత థ్రిల్లర్ కథ అని అర్థమవుతోంది. బాహుబలి ప్రభాకర్ గెటప్, క్యారక్టర్ చాలా కొత్తగా ఇంట్రస్టింగ్ గా ఉంది. కంటెంట్ బావుంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ సినిమాలను సక్సెస్ చేస్తున్నారు. నేను చూసిన పాట, మోషన్ పోస్టర్ తో దర్శకుడు పాలిక్ ప్రతిభ ఏంటో కనబడుతోంది. జాన్ భూషన్ సంగీతం వినసొంపుగా ఉంది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ నటించిన నటీనటులకు, దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు“ అన్నారు.
నిర్మాత రావుల రమేష్ మాట్లాడుతూ..“నా తొలి చిత్రంలోని తొలి పాటను రిలీజ్ చేసి మా యూనిట్ కు బ్లెస్సింగ్స్ అందించిన రాజ్ కందుకూరి గారికి నా ధన్యవాదాలు. దర్శకుడు పాలిక్ పక్కా ప్లానింగ్ తో ప్రభాకర్ గారి సపోర్ట్ తో ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ చిత్రాన్ని నిర్మించాము. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలో చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం“ అన్నారు.
దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ..“ లక్కీ హ్యాండ్ అయిన రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా మా చిత్రంలోని ఫస్ట్ లిరికల్ సాంగ్, మోషన్ పోస్టర్ లాంచ్ కావడం ఎంతో శుభపరిణామంగా భావిస్తున్నాం. జాన్ భూషన్ చక్కటి బాణీ లు ఇవ్వగా అద్భతుమైన సాహిత్యాన్ని `బొంబాయి పోతావా రాజా` ఫేమ్ సురేష్ గంగుల అందించారు. అలాగే ప్రభాకర్ గారు, మోహన, రఘు, వెంకట్ ఆకట్టుకునే హావభావాలు కనబరిచారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా మా చిత్రంలోని పాటలు వినవచ్చు“ అన్నారు.
హీరోయిన్ మోహన మాట్లాడుతూ..“మా చిత్రంలోని `సురు సుర` అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశాం. ఈ చిత్రంలో నేనొక మంచి పాత్రలో నటించా. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు“ అన్నారు.
సంగీత దర్శకుడు జాన్ భూషన్ మాట్లాడుతూ…“`మా మూవీలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ చేసిన రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆర్ ఆర్ చేస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను. సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. మ్యాంగో మ్యూజిక్ ద్వరా విడుదలైన మా ఫస్ట్ లిరికల్ సాంగ్ ని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నా“ అన్నారు.
నటుడు రఘు మాట్లాడుతూ…“ ఈ చిత్రంలోని పాటలన్నీ నాకు ఎంతో ఇష్టం. ఈ రోజు విడుదలైన సుర సుర సాంగ్ పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.
రఘు, వెంకట్, మోహన సిద్దిఖి, పాయల్ రాజ్ పుత్, సీనియర్ నటుడు సూర్య, తాగుబోతు రమేష్, గబ్బర్ సింగ్ బ్యాచ్, రఘు, వెంకట్ ముఖ్య పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి డిఓపీః గిరి-వెంకట్; సంగీతంః జాన్ భూషన్; స్టంట్స్ః రన్ రవి; ఎడిటర్ః రామకృష్ణ అర్రమ్; ఆర్ట్ః సురేష్ భీమగాని; లిరికల్ వీడియో: నిశాంత్ ; పాటలుః సురేష్ గంగుల; పీఆర్వోః రమేష్ చందు ( బాక్సాఫీస్) ;నిర్మాతః రావుల రమేష్; స్క్రీన్ ప్లే- మాటలు-దర్శకత్వంః పాలిక్.