కాంగ్రెస్ లో వైసిపి ని విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు.
‘ఐదున్నరేళ్ల తర్వాత జగన్ బెంగళూరు వెళ్తే.. కాంగ్రెస్ లో వైసిపి విలీనం చేయడానికే వెళ్లారని ప్రచారం చేస్తున్నారు.
16 నెలలు జైల్లో ఉంటేనే సోనియాకు లొంగలేదు. ఓడిపోతే తగ్గుతాడా? మళ్లీ సీఎం అయ్యే వరకూ తాడేపల్లిలోనే ఉండి రాజకీయ కార్యక్రమాలు చేస్తారు.
మీకు చేతనైంది చేసుకోండి. జగన్ తగ్గడు’ అంటూ ఫైరయ్యారు.