తెలంగాణా కొత్త సీఎం రేవంత్ నిర్ణయాలపై అన్ని వర్గాల ప్రజలు ప్రశంశలు కురిపిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే అందులో రెండింటినీ అమలు చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ.5 నుంచి రూ.10 లక్షలకు పెంచారు. త్వరలోనే ప్రతి రేషన్ కార్డు ఉన్న ఇంటికీ రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడానికి కసరత్తు ప్రారంభించారు. అలాగే అర్హులైన వారికి బియ్యం రేషన్ కార్డులు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నిర్ణయాలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఉపయోగం అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్ కొనియాడారు.
ఇలా ఓ వైపు మాని ఫెస్టో ను అమలు చేసుకుంటూ పోతూనే… మరో వైపు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజలనుంచి మన్ననలు ఒందుతున్నాడు రేవంత్. గిగ్ వర్కర్లతో సమావేశమై … వారి కష్టాలు తెలుసుకుని… ఆటో, క్యాబ్, రిక్షా డ్రైవర్లకు రూ.5లక్షల వరకు ప్రమాద బీమా, రూ.10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ ఇవ్వ నున్నట్లు ప్రకటించారు. అలాగే ఫుడ్ డెలివరీ బాయ్స్ అయిన స్విగ్గి, జొమాటో తదితర వర్కర్లకు ఇది వర్తిస్తుందని తెలిపాడు. దీని వల్ల లక్షలాది కుటుంబాలకు భరోసా ఇచ్చాను నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతే కాదు… ప్రజల సమస్యలను నిత్యం పరిష్కరించడానికి ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణికి శ్రీకారం చుట్టారు. అలాగే… ఓ ఎనిమిది రోజుల పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజల్లో ఉండి… వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఈ నెల 26వ తేదీ నుంచి ప్రజా పాలన పేరుతో పల్లెబాట పట్టించనున్నారు. ఇందుకోసం జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించారు. దాని వల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అజహరుద్దీన్ అన్నారు.
ఇలా రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనా పరమైన నిర్ణయాలతో ముందుకు పోతుంటే… అధికార పార్టీ నేతలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ నియోజక వర్గం కాంగ్రెస్ ఇంఛార్జి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజహరుద్దీన్… రేవంత్ రెడ్డి నిర్ణయాలను మెచ్చుకున్నారు. ఈ నిర్ణయాల వల్ల రాబోవు పార్లిమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత బలపడి ఎక్కువ స్థానాలను గెలుస్తుందని అన్నారు. రేవంత్ నిర్ణయాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా వుంటున్నాయన్నారు.