ఆ ఒక్క మాటతో మట్టికొట్టుకుపోయిన జనసేన ప్రస్థానం
జనసేన స్థాయిని పాతాళానికి తోక్కేసిన పవన్ నోటి దురుసు
పవన్ తీరుపట్ల నాయకుల్లో చిరాకు
ఇటు వాలంటీర్ల ముప్పేట దాడి
పవన్ కళ్యాణ్ కు తొలిసారిగా తెలిసొచ్చింది. వ్యక్తులమీద కామెంట్లు చేసినంత ఈజీగా వ్యవస్థలమీద నోరు పారేసుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో అర్థమైంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రెండున్నర లక్షలమంది సైన్యంతో బలమైనదిగా ఉన్న వాలంటీర్ వ్యవస్థను కించపరుస్తూ వారిని హ్యూమన్ ట్రాఫికర్స్ అంటూ ఆవమానకరంగా మాట్లాడినందుకు పవన్ గట్టి మూల్యమే చెల్లించుకున్నారు. పవన్ చేసిన ఈ నోటి దురుసు కామెంట్లు ప్రజల్లో అయన స్థాయిని పాతాళానికి తీసుకెళ్లాయి. ఇక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది వాలంటీర్లు, వారి కుటుంబీకులు సైతం పవన్ నోటి దురదను గట్టిగా వ్యతిరేకిస్తూ ధర్నాలు, దిష్టిబొమ్మల దగ్ధం వంటి నిరసనలతో రాష్ట్రాన్ని హోరెత్తించడంతోబాటు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు సైతం చేశారు. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులు అనే కామెంట్ తో పవన్ ఒక్కసారిగా రెండున్నర లక్షలమంది వాలంటీర్లతోబాటు వారి కుటుంబీకులు… మొత్తం పది లక్షలమందితో శత్రుత్వాన్ని కొనితెచ్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవస్థతో పవన్ కోరి కొరివితో తలగోక్కున్నట్లు అయింది.
*ఇంటా బయటా విమర్శలు*
రాష్ట్రంలో కోవిడ్ . వరదలు వంటి కష్టకాలంలో సైతం వలంటీర్ల సేవలు నిరుపమానం. కోవిడ్ మృతులను చూసేందుకు సైతం బంధుమిత్రులు.. ఆఖరుకు.. కన్నవాళ్ళు… కట్టుకునేవాళ్ళు రాలేక భయంగా ఉన్న రోజుల్లోపు వారి శవాలను తీసుకెళ్లి కర్మకాండలు జరిపించిన సేవకులు వాలంటీర్లు. గోదావరి జిల్లాల్లో వరదలు మునిగిపోయి బిక్కుబిక్కుమంటున్న వారికి పీకల్లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి సరుకులు ఇచ్చి మీకు మేమున్నాం అని భరోసా ఇచ్చిన సొంత మనుషులు వాలంటీర్లు.. అలాంటి వారిమీద కావాలని , కోరి తగాదా తెచ్చుకోవడం ద్వారా పవన్ తన ఆజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడని జనసేన నాయకులే అంటున్నారు. గ్రామాల్లో వృద్ధులు.. బాలింతలు.. ఇతర అభాగ్యులకు సొంత మనుషుల్లా సేవలు అందించే ఓ పెద్ద వ్యవస్థను కావాలని తనకు వ్యతిరేకంగా మార్చుకున్న పవన్ ఇప్పుడు తన మాటలకు క్షమాపణ చెప్పలేక, కొత్త భాష్యం అందుకున్నారు. వాలంటీర్లు అందరూ కాకున్నా కొందరు చెడ్డవాళ్లున్నారు అని మెలిక తిప్పారు కానీ తాను విస్తృతంగా పర్యటిస్తున్న గోదావరి జిల్లాలో అయన సామాజికవర్గానికి చెందిన కాపు యువత ఎంతోమంది వాలంటీర్లుగా ఉన్నారు. మరి ఈయన నోటిదురుసు ప్రకటనతో వారి మనోభావాలు దెబ్బతినవా ? ఏమిటో ఈ బుర్రతక్కువ కొండగొర్రి మాటలు. పదేనేళ్ళుగా రాజకీయాల్లో ఉంటూ ఏది మాట్లాడాలో ఏది ఆడకూడదో తెలియని ఇలాంటి నాయకుణ్ణి నమ్ముకుని వెళ్తే కుక్క తోకపట్టుకుని గోదారి ఈదినట్లే అని కార్యకర్తలు అంటున్నారు. ప్రజామన్ననలు అందుకున్న వాలంటీర్ వ్యవస్థమీద విమర్శలు చేయడం అంటే తన సమాధి తానే తవ్వుకున్నటు అని పార్టీలోని నాయకులూ, సానుభూతిపరులు సైతం అంటున్నారు.. ఛీఛీ… పవన్ ఏదోనాటికి నాయకుడు అవుతాడు అనుకుంటే ఇలా పరువుతీసుకుని నేలబారు మనిషి అయిపోతాడని అనుకోలేదని మరికొందరు విమర్శిసున్నారు.