• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రికార్డు స్థాయిలో NTR స్మారక నాణెం అమ్మకాలు!

admin by admin
November 19, 2023
in politics
0 0
0
రికార్డు స్థాయిలో NTR స్మారక నాణెం అమ్మకాలు!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

హైదరాబాద్ మింట్ లో తయారైన తొలి స్మారక నాణెం ఎన్ .టి .రామారావు గారిది , ఈ నాణెం రెండున్నర నెలల్లో 25, 000 అమ్ముడు పోవడం దేశంలోనే సరికొత్త రికార్డు అని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వి .ఎన్ .ఆర్ . నాయుడు చెప్పారు.
శనివారం, ఎన్ .టి .ఆర్. సెంటినరీ కమిటీ చైర్మన్ టి,డి .జనార్దన్ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ మింట్ అధికారులు వి, ఎన్ .ఆర్ .నాయుడు, శ్రీనివాస్ గండపనేడు , తానాజీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ – దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైంది, మొదట జవహర్ లాల్ నెహ్రూ , ఆ తరువాత మహాత్మా గాంధీ లాంటి మహనీయుల నాణేలను కేంద్రం విడుదల చేయడం జరిగిందని , అయితే ఇప్పటి వరకు స్మారక నాణేలలో 12,000 నాణేలు రికార్డు అని , ఆ రికార్డు ను ఎన్ .టి .ఆర్ . స్మారక నాణెం బ్రేక్ చేసిందని , ఆగష్టు 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఢిల్లీలో విడుదల చేశారని , 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామని చెప్పారు . కేవలం రెండున్నర నెలల్లోనే 25,000 స్మారక నాణేలను విక్రయించడం జరిగిందని చెప్పారు .
కమిటీ చైర్మన్ టి .డి .జనార్దన్ మాట్లాడుతూ , అన్న ఎన్ .టి .ఆర్ పేరుతో ఏ కార్యక్రమం మొదలు పెట్టిన నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పారు . అన్న గారి శతాబ్ది సంవత్సరంలో మా కమిటీ , ఎన్ .టి .ఆర్ .శాసన సభ ప్రసంగాలు , ఎన్ .టి .ఆర్ .చారిత్రిక ప్రసంగాలు , శకపురుషుడు ప్రత్యేక సంచికను వెలువరించాము . విజయవాడ , హైదరాబాద్ లో రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి అన్న గారికి ఘనమైన నివాళి అర్పించాము .
ఇప్పుడు ఎన్ .టి .ఆర్ .స్మారక నాణెం రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని తెలిసి ఎంతో సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు . దేశంలో ఇప్పటి వరకు 200 నాణేలను విడుదల చెయ్యగా ,అందులో అన్నగారి స్మారక నాణెం ప్రథమ శ్రేణిలో ఉండటం మాకు గర్వకారణం , ఇది గిన్నెస్ రికార్డు సృష్టించాలని మేము కోరుకుంటున్నామని జనార్దన్ చెప్పారు .
శ్రీనివాస్ గుండపనేడు మాట్లాడుతూ , రామారావు గారంటే మా అందరికీ అభిమానం , కేంద్రం వారి స్మారక నాణెం విడుదల చెయ్యాలని సంకల్పించిందని మాకు సమాచారం రాగానే హైదరాబాద్ మింట్ లో పనిచేసే మాకు ఎంతో సంతోషం కలిగింది , ఎందుకంటే ఇది హైద్రాబాద్లో తాయారు కాబోతున్న తొలి నాణెం , మా చీఫ్ జనరల్ మేనేజర్ నాయుడు గారి పర్యవేక్షణలో అనేక నమునాలను చేసి అత్యుత్తమ డిజైన్ ను ఎంపిక చేయడం జరిగింది , ఇది అందరికీ నచ్చడం మాకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు .
తానాజీ మాట్లాడుతూ , నేను తెలుగు వాడిని కాదు ,అయినా రామారావు గారి గురించి విన్నాను, వారి స్మారక నాణెం హైదరాబాద్ మింట్ నుంచి వస్తున్నదంటే ఎంతో మంది ద్రుష్టి ఉంటుంది , అందుకే ఎలాంటి విమర్శలు , అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, మా కృషి ఫలించిందని చెప్పారు . ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కంఠంనేని రవి శంకర్ , భగీరథ , విక్రమ్ పూల , దొప్పలపూడి రామ్ మోహన్ , మండవ సతీష్ పాల్గొన్నారు .

Previous Post

మంగళవారం’ కథ విన్నప్పుడు ‘అన్వేషణ’ గుర్తొచ్చింది; నిర్మాత ‘దిల్’ రాజు

Next Post

ప్రపంచ ‘ట్రయత్‌లాన్‌ ’కు వరుసగా మూడుసార్లు ఎంపికైన తొలి భారతీయుడు మన తెలుగువాడు

Next Post
ప్రపంచ ‘ట్రయత్‌లాన్‌ ’కు వరుసగా మూడుసార్లు ఎంపికైన తొలి భారతీయుడు మన తెలుగువాడు

ప్రపంచ ‘ట్రయత్‌లాన్‌ ’కు వరుసగా మూడుసార్లు ఎంపికైన తొలి భారతీయుడు మన తెలుగువాడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్
movies

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

by admin
September 30, 2026
0

...

Read more
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

ఘనంగా “మా రాముడు అందరివాడు” సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్

September 6, 2026
ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

ఘనంగా ‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా సక్సెస్ మీట్

September 5, 2026
టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన  “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

టీచర్స్‌ డే రోజున ఘనంగా విడుదలైన “జయంత్‌ అండ్‌ ది జింగోపెన్‌” సినిమా ఫస్ట్‌లుక్‌ లాంచ్‌

September 5, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In