• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా “నైజం” షూటింగ్ ప్రారంభం

admin by admin
February 12, 2022
in movies
0 0
0
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సోషల్ ఓరియంటెడ్ కుటుంబ కథా నేపథ్యంలో సమాజంలో జరుగుతున్నటువంటి వ్యక్తుల యొక్క నైజం వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, వ్యవహారిక శైలి వంటి అనేక కోణాలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం “నైజం’. ట్రూత్ అఫ్ లైఫ్ అనేది క్యాప్షన్. భార్గవి శ్రీ డైమెన్షన్  ఫిలిం పతాకంపై సంజయ్,రవి కిరణ్, సార నటీ,నటులుగా కోన రమేష్ దర్శకత్వంలో కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, లగుడు లోవ సత్య నారాయణ( బుజ్జి ) సంయుక్తంగా కలసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో ఘనంగా జరుపుకుంది. పూజా కార్యక్రమాలు అనంతరం ముఖ్య అతిధులుగా వచ్చిన శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డాక్టర్ కత్తి మండ ప్రతాప్ హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, చిత్ర దర్శకుడు కోనరమేష్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

చిత్ర నిర్మాత కాండ్రేగుల చందు మాట్లాడుతూ.. దర్శకుడు  రమేష్ చెప్పిన కథ  నాకు చాలా బాగా నచ్చింది. కాన్సెంట్రేట్ గా వినడం జరిగింది.ఒక మనిషి యొక్క యాట్యిట్యూడ్ ఏంటి, ఎప్పుడు ఎలా ప్రభావితం అవుతారు వంటి అనేక అంశాలను ఇందులో చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. కథ నచ్చడంతో రామాంజనేయులు,సత్య నారాయణ గార్లతో  కలిసి బడ్జెట్లో ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చాము. హీరో హీరోయిన్లు పాత్రలు చాలా చక్కగా కుదిరాయి. కుటుంబ సమేతంగా చూడవలసిన ఈ సినిమాను  ప్రతి ఒక్కరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మరో నిర్మాతలు ఎన్నంశెట్టి ఆంజనేయులు, సత్యనారాయణ లు మాట్లాడుతూ.. వ్యక్తుల యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది ఒక వ్యక్తి యొక్క నైజాన్ని ఏమి చూసి గుర్తిస్తారు అనేద కథాంశంతో భార్గవి శ్రీ డైమెన్షన్ ఫిలిం పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేసి ఉగాది నాటికి ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేస్తాం. అందరూ మా సినిమాని ఆశీర్వదిస్తూ మీ అందరి సహకారాలు మాకు ఉండాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు కోన రమేష్ మాట్లాడుతూ.. వ్యక్తుల యొక్క నైజం వ్యక్తిత్వాలు, మనస్తత్వాలు, వ్యవహారిక శైలి వంటి అనేక కోణాలతో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం “నైజం”. తనికెళ్ళ భరణి గారి ఇన్స్పిరేషన్ తో ఈరోజు డైరెక్టర్ అవ్వడం జరిగింది  మా నిర్మాతలు కాండ్రేగుల చందు, ఎన్నంశెట్టి ఆంజనేయులు, సత్యనారాయణ  గార్లు వారి భుజాల మీద ఈ చిత్రాన్ని మోసుకొని నాకు ఈ సినిమాలో దర్శకత్వం చేసే అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. యూనిట్లో ప్రతి ఒక్కరూ నన్ను  నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హైదరాబాద్, మారేడు మిల్లి తదితర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమాను కంప్లీట్ చేస్తాం. మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని అన్నారు.

మాటలు పాటల రచయిత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మంచి టాలెంటెడ్ పర్సన్ మనిషి యొక్క నైజాన్ని ఈ చిత్రం ద్వారా ప్రత్యేకమైనటువంటి విభిన్నమైన శైలిలో చూపించడం జరుగుతుంది. అనేక మైనటువంటి కోణాల్లో గ్రామీణ  ప్రాంత నేపథ్యంలో నిర్మాణం జరుగుపుకుంటున్న ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్ లో  పూర్తి చేస్తారు. ఈ సినిమాకు కుమార్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇస్తున్నారు. హీరో హీరోయిన్లు చక్కటి జోడీ కుదిరింది. సినిమా నిర్మాణంలో బడ్జెట్ కు  వెనుకాడకుండా  ముందుకు వచ్చి నిర్మిస్తున్న నిర్మాతలకు ఈ చిత్రం తప్పకుండా విజయవంత మవుతుందని ఆశిస్తున్నాను

సంగీత దర్శకుడు  మోహన్ కుమార్ మాట్లాడుతూ..దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను బ్యాగ్రౌండ్ స్కోరు పాటలకు మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది.అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది ఆన్నారు.

చిత్ర హీరో సంజయ్ మాట్లాడుతూ..కథ చాలా బాగుంది.మంచి సోసియల్ మెసేజ్ ఉన్న నైజం చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరోయిన్ సార మాట్లాడుతూ ..నా మీద ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంచుకొని ఈ సినిమాలో నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మంచి సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు
ఈ సినిమా ఆ గొప్ప సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుతున్నాను

నటీనటులు
సంజయ్,సార,రవికిరణ్,ముగ్గు నగేష్

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : భార్గవి శ్రీ డైమెన్షన్  ఫిలింస్
దర్శకుడు : కోన రమేష్
నిర్మాతలు : కాండ్రేగుల చందు, ఆంజనేయ ఎన్నంశెట్టి, లగుడులోవ సత్య నారాయణ( బుజ్జి)
సంగీతం ‘: ఎం ఎం కుమార్,
మాటలు,పాటలు, : డాక్టర్ కత్తిమండ ప్రతాప్,
డి.ఓ.పి : మహేంద్ర ఎస్
పి.ఆర్.ఓ : సాయి సతీష్, పర్వతనేని  రాంబాబు

Previous Post

ఆర్ ఎన్ సిల్క్స్ ప్రారంభోత్సవంలో మెరిసిన బిగ్ బాస్ ఫేమ్ హిమజ, నటి శ్రీవాణి..!!

Next Post

సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ ప్రారంభం

Next Post

సిరిసాల అశ్విని ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్ బ్యానర్ ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక
movies

ఘనంగా అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ టీజర్ లాంచ్ వేడుక

by admin
June 24, 2025
0

...

Read more
ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

ఘనంగా విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025 కార్యక్రమం

June 23, 2025
‘కుబేర’ మూవీ రివ్యూ

‘కుబేర’ మూవీ రివ్యూ

June 20, 2025
ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

ఫ్రీమాంట్ లో ‘మినీ మహానాడు -2025’ గ్రాండ్ సక్సెస్!

May 29, 2025
మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

మీడియా వారి చేతుల మీదుగా “కలివి వనం” చిత్ర పోస్టర్ లాంచ్

May 19, 2025
మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

మ‌ధ్య ప్ర‌దేశ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న స‌రికొత్త హార‌ర్ థ్రిల్ల‌ర్ అమ‌రావ‌తికి ఆహ్వానం

May 18, 2025
నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

నవ్విస్తూ… భయపెట్టే “శుభం”

May 9, 2025
Review; “హిట్: ది థర్డ్ కేస్”

Review; “హిట్: ది థర్డ్ కేస్”

May 1, 2025
లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

లక్ష్య సంకల్ప ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిలోఫర్ ఆసుపత్రి వద్ద అన్నదానం

April 29, 2025
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In