• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

నూతన ఒరవడి సృష్టిస్తున్న నారా లోకేష్ “ప్రజాదర్బార్”

admin by admin
July 9, 2024
in politics
0 0
0
నూతన ఒరవడి సృష్టిస్తున్న నారా లోకేష్ “ప్రజాదర్బార్”
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

గుంటూరు : ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” నూతన ఒరవడితో ముందుకు సాగుతోంది. సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలను నమస్కారం తాతయ్య, నమస్కారం అమ్మ, నమస్కారం చెల్లీ అంటూ ఆత్మీయంగా పలకరిస్తున్న యువనేత వారి నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు. గత ప్రభుత్వంలో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని బారికేడ్లతో నిలువరించి అనేక ఇబ్బందులకు గురిచేశారు. నేడు ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు ఆయా సమస్యల పరిష్కారానికి సిబ్బంది ఆదేశాలు జారీ చేశారు. 14వ రోజు ప్రజాదర్బార్ కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలి..

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొంతమంది ఆయాలు, పారిశుద్ధ్య కార్మికులను గత ప్రభుత్వం అర్దాంతరంగా తొలగించిందని, ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన ఏపీజీసీఏఎస్ యూనియన్ ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నామని, పాఠశాలల విలీనం వల్ల పని ఒత్తిడి పెరిగిందని తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. కనీసం వేతనం అమలుచేయడంతో పాటు అకారణంగా విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఆయాలు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను విన్న మంత్రి లోకేష్… పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు.

తాగునీటి సమస్యను పరిష్కరించాలి..

పక్షవాతంతో బాధపడుతున్న తనకు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరి నియోజకవర్గం మెల్లంపూడికి చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన సతీమణి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని మంగళగిరి హుడా కాలనీకి చెందిన షేక్ మౌలాలి కోరారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తాడేపల్లి కిస్ట్నా సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికుల జీతం బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కేసీ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతంలో తాగునీటి సరఫరాతో పాటు వీధి లైట్లు ఏర్పాటుచేయాలని ఆత్మకూరులోని సీతారామ అపార్ట్ మెంట్ వాసులు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన అక్రమాలపై న్యాయ విచారణ జరిపించి, తక్షణమే వైస్ ఛాన్స్ లర్ ను నియమించాలని విశాఖకు చెందిన ఏపీ బీసీ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా నాగలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్న తనను గత ప్రభుత్వం అకారణంగా తొలగించిందని, తిరిగి ఉద్యోగం కల్పించాలని ఎన్. మహేశ్వరి కోరారు. శ్రీశైలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న తనకు మినిమమ్ టైమ్ స్కేల్ వర్తింపజేయాలని డీసీ ఉన్నూరు సాహెబ్ కోరారు. గుంతకల్లు నియోజకవర్గం కసాపురం గ్రామంలో నిరుపయోగంగా ఉన్న వాటర్ ట్యాంక్ కు మరమ్మతులు చేయించి 8 గ్రామాల ప్రజలకు తాగునీటి వసతి కల్పించాలని వై.జీవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మూడేళ్ల సర్వీస్ పూర్తిచేసుకున్న దివ్యాంగ ఉద్యోగులకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలని విజయవాడకు చెందిన ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ దివ్యాంగ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న వారికి పరీక్ష నిర్వహించాలని, అర్హత పత్రాలు మంజూరు చేయాలని, ఆర్ఎంపీ బోర్డు ఏర్పాటుచేయాలని నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు.

Previous Post

మ‌న‌సంతా నువ్వే డైరెక్ట‌ర్ ఆదిత్య కొత్త సినిమా..అమెరికా అడిష‌న్స్‌లో అదుర్స్ ..!

Next Post

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

Next Post
వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

వాట్సప్‌లోనూ వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”
movies

పల్లెటూరి నేటివిటీ, సెంటిమెంట్, మాస్ అంశాలతో ఆకట్టుకునే “మా రాముడు అందరివాడు”

by admin
September 4, 2026
0

...

Read more
Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

Natti Kumar Vows to Fight for Producers’ Welfare, Challenges Panels on Medical Insurance and Pension Benefits

September 4, 2026
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

September 4, 2026
మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

మూవీ రివ్యూ: మెసేజ్‌తో పాటు మంచి యాక్షన్‌ను పంచే పొలిటికల్ డ్రామా.. ‘ధర్మస్థల నియోజకవర్గం’

September 3, 2026
ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

September 3, 2026
ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

ఘనంగా జరిగిన గుడ్ టైం టీజర్ లాంచ్ ఈవెంట్..

September 1, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

‘ధర్మస్థల నియోజకవర్గం’ “ఆది” అంత గొప్ప సినిమా అవుతుంది – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో – స్టార్ డైరెక్టర్ వి. వి. వినాయక్

August 31, 2026
మిస్సింగ్ మేఘన 2nd  లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

మిస్సింగ్ మేఘన 2nd లిరికల్ ను లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

August 30, 2026
యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

August 29, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In