• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న చంద్రబాబు బయోపిక్ ‘తెలుగోడు’

admin by admin
May 9, 2024
in politics
0 0
0
యూట్యూబ్‌లో సంచలనాలు నమోదు చేస్తున్న చంద్రబాబు బయోపిక్ ‘తెలుగోడు’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఆయనొక విజనరీ. ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణలు, భావి తరాల భవిష్యత్తుకు వేసిన బాటలు చరిత్ర. తెలుగు జాతి ఉన్నతికి కృషి చేసిన ఆయన జీవితంపై ఓ బయోపిక్ తెరకెక్కింది.

నారా చంద్రబాబు నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ ‘తెలుగోడు’. ప్రపంచంపై తెలుగోడి సంతకం అనేది ఉపశీర్షిక. విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో సినిమా తెరకెక్కింది. కథ, కథనం, మాటలు అందించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో డాక్టర్ వెంకీ మేడసాని ఈ చిత్రాన్ని నిర్మించారు. యూట్యూబ్‌లో సినిమాను విడుదల చేశారు. గురువారం ఉదయం విడుదలైన ఈ సినిమా సామజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది.

చిత్రసీమలో ఎటువంటి నేపథ్యం గానీ, అనుభవం గానీ లేని హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ వెంకీ మేడసాని… తొలి ప్రయత్నంలో తెలుగు ప్రజానీకంపై తనదైన ముద్ర వేసిన చంద్రబాబు బయోపిక్ తీసి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ సినిమా విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ”చంద్రబాబు గారి జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. నన్ను ఆ అంశం ఎక్కువ ఆకర్షించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాలు గడిచినా పల్లెటూరి ప్రజల జీవితాలు మారలేదు. చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్స్ మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా! ఎటువంటి సామజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు. ఆ పాయింట్ మీద సినిమా తీశా” అని చెప్పారు.

అభివృద్ధి అందరినీ ఒక్కటి చేస్తుందనే అంశం మీద తాను సినిమా తీశానని, నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఆలోచించారు? అనేది ‘తెలుగోడు’ కాన్సెప్ట్ అని డాక్టర్ వెంకీ మేడసాని చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ… ”ప్రపంచానికి తెలియని ఓ ప్రాంతాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలని భావించిన ఓ నాయకుడి కథ మా సినిమా. ఐదారు నెలల క్రితం సినిమా తీయాలని నేను అనుకున్నా. కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిశా. కొందరు పెద్దలనూ కలిశా. రాజకీయ నాయకుడి సినిమా సినిమా తీస్తే విజయం సాధించదని వారించారు. పాయింట్ నచ్చి సినిమా తీశా. చిన్న ఆర్టిస్టులతో పెద్ద సినిమా తీశాం. కంటెంట్ మీద నమ్మకంతో ప్రజలకు చేరువ అవుతుందని తీశాను. ఎక్కువ మంది ప్రజలకు సినిమా చేరాలనే ఉద్దేశంతో యూట్యూబ్ రిలీజ్ చేశాం. నేను సినిమా తీయగలననే కాన్ఫిడెన్స్ ఈ సినిమా ఇచ్చింది” అని చెప్పారు.

చంద్రబాబు పాత్రలో వినోద్ నటించిన ‘తెలుగోడు’ చిత్రానికి ఛాయాగ్రహణం: మల్లిక్ చంద్ర, సంగీతం: రాజేష్ రాజ్, కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – ప్రొడ్యూసర్ – డైరెక్టర్: డాక్టర్ వెంకీ మేడసాని.

Movie Link :  https://youtu.be/CB-BNVWcLYg?si=tOCIycJbZXjLtfTd

#Telugodu
#NaraChandraBabuNaiduBiopic

Previous Post

సినిమాటోగ్రఫర్ భరణి.కె.ధరన్ దర్శకత్వంలో ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్ ‘సివంగి’

Next Post

సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసిన యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ ‘మాత్రు’ ఫస్ట్ లుక్

Next Post
సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసిన యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ ‘మాత్రు’ ఫస్ట్ లుక్

సెన్సేషనల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ లాంచ్ చేసిన యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ 'మాత్రు' ఫస్ట్ లుక్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అమూల్ తరువాత నాణ్యతలో సంగం డెయిరీనే..సవాల్ విసురుతున్నా _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ
politics

అమూల్ తరువాత నాణ్యతలో సంగం డెయిరీనే..సవాల్ విసురుతున్నా _ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ

by admin
March 5, 2026
0

...

Read more
సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

సన్ ఆఫ్ మూవీ రివ్యూ: కట్టిపడేసే తండ్రీకొడుకుల బంధం

February 28, 2026
పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

పేలుడులో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం- సీఎం చంద్రబాబు

February 28, 2026
హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

హుషారు పిట్టలు చిత్రం నుంచి ‘మంగళస్నానం’ లిరికల్‌ సాంగ్‌ విడుదల

February 28, 2026
యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో  హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్  ప్రాజెక్ట్ ప్రారంభం

యూత్‌ఫుల్ లవ్ డ్రామాతో హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌‌పై ప్రెస్టేజీయస్ ప్రాజెక్ట్ ప్రారంభం

February 28, 2026
హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన‌ హీరోయిన్ కేథరీన్ థెరీసా

February 28, 2026
రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

రియల్ కబడ్డీ ప్లేయర్స్ తో డా. ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న “మహిళా కబడ్డీ”

February 28, 2026
KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

KRR సైన్స్‌ ఎక్స్‌పోలో 204 దేశాల క‌రెన్సీ నోట్లు..100 కోట్ల డాల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌

February 28, 2026
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా హారర్ కామెడీ మూవీ “రుక్మిణి” టీజర్ లాంఛ్

February 28, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In