90’s లో ఓ వెలుగు వెలిగిన ఆమని…. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనతి కాలంలోనే దూసుకుపోతోంది. ఇటు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నూ…. అటు సోలో పాత్రలు పోషిస్తూ మెప్పిస్తోంది. తాజాగా నారి సినిమాలో మెయిన్ లీడ్ రోల్ పోషించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ఆడియాన్స్ ను ఆకట్టుకున్నాయి. రమణ గోగుల గాత్రం కూడా యాడ్ కావడంతో సినిమాకి ప్లస్ పాయింట్. ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఎలా వుందో చూద్దాం పదండి.
కథ:
భారతి(ఆమని) అనే టీచర్ కథను చూపిస్తూ సాగుతుంది నారి మూవీ. భారతి ఒక పాత్రే కానీ ఆ పాత్ర నేటి సమాజంలోని సగటు స్త్రీ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఒక్క పాత్రను సింబాలిక్ గా చూపిస్తూ సొసైటీలో ఎన్ని అఘాయిత్యాలు అమ్మాయిలపై జరుగుతున్నాయో తెరకెక్కించారు దర్శకుడు సూర్య వంటిపల్లి. నారి చిత్రం మహిళా సమస్యల నేపథ్యంతో తెరకెక్కినా ఇందులో మహిళా పాత్రల్ని చాలా పవర్ ఫుల్ గా చూపించడం విశేషం. ఓ యువతిపై అత్యాచారం చేస్తాడు మంత్రి కొడుకు. ఆ నేరస్తుల్ని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని ప్రయత్నిస్తుంది లాయర్ శారద (ప్రగతి). తన న్యాయవాద వృత్తిలో చూసిన ఓ గొప్ప మహిళ భారతి కథను తన తోటి వారికి చెబుతూ గుర్తు చేసుకుంటుంది. తన జీవితంలో మొదట తండ్రి, ఆ తర్వాత భర్త, ఆ తర్వాత కొడుకు పెట్టిన ఇబ్బందుల్ని ధీరోదాత్తురాలిగా భారతి ఎలా ఎదుర్కొంది అనేది తెరపై చూడాలి.
విశ్లేషణ:
నగరంలో జరిగిన యువతి రేప్ ఘటనతో నారి మూవీ సీరియస్ టోన్ లో ప్రారంభమవుతుంది. మంత్రి తన కొడుకు కోసం లాయర్ శారదను బెదిరించడం, తను హీరోయిక్ గా మంత్రి వార్నింగ్ పట్టించుకోకపోవడంతో ఆసక్తికరంగా సినిమా బిగిన్ అవుతుంది. భారతి గురించి లాయర్ శారద చెప్పడం నుంచి ప్రేక్షకులు కథలో లీనమవుతారు. ఈ ఇంటెన్స్ స్టోరీలో లైటర్ వేన్ గా ఉండేందుకు ఆనంద్ (వికాస్ వశిష్ట)తో భారతి టీనేజ్ లవ్ స్టోరీ, ఒక లవ్ సాంగ్ గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే, పెళ్లయ్యాక హవాయి హవాయి సాంగ్స్ తెరకెక్కించారు. ఈ రెండు సాంగ్స్ తో సీరియస్ నెస్ తో సినిమా చూస్తున్న ప్రేక్షకులు రిలీఫ్ అవుతారు. తండ్రి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకు ఇంటి నుంచి తనను ప్రేమిస్తున్న వాడితో వెళ్లిపోతుంది భారతి. ఇవాళ సమాజంలో ప్రేమ పేరుతో మోసపోతున్న వేలాది మంది యువతులకు భారతి ప్రతీక. అమ్మాయిల కుటుంబ బలహీనతను వాడుకుంటున్న ఎంతోమంది అబ్బాయిలకు నిదర్శనం వికాస్ చేసిన ఆనంద్ పాత్ర. ప్రేమించినవాడితో మోసపోయిన భారతి ఏం చేసింది అనేది దర్శకుడు సూర్య ఒక కొత్త తరహాలో అద్భుతంగా తెరకెక్కించాడు. మృగాళ్లకు మంచితనం పనికి రాదని, వారిని చట్టం ముందు దోషిగా నిలబెట్టిన భారతి తెగున ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. చివరకు తన కొడుకే తప్పు చేసినా శిక్షిస్తుందని భారతి. తన బిడ్డమీద ప్రేమ కంటే సాటి అమ్మాయికి జరిగిన నష్టమే భారతిని ఎక్కువ బాధపెడుతుంది.
వుమెన్ సెంట్రిక్ మూవీస్ లో నారి శిఖరంలా నిలబడుతుంది. ఈ సినిమాకు జాతీయ అవార్డ్ రావాల్సిన అర్హత ఉంది. సమాజానికి మంచి చెప్పి, ప్రేక్షకులను గొప్ప మార్గంలో నడిపించే స్ఫూర్తి నింపే నారి లాంటి చిత్రాలు మరిన్ని రావాలి. ఇలాంటి అరుదైన ప్రయత్నం చేసే మేకర్స్ కు ప్రోత్సాహం లభిస్తేనే మరిన్ని ఇలాంటి గొప్ప చిత్రాలు చేసే ఉత్సాహం వారిలో కలుగుతుంది. ప్రేక్షకులు ఆద్యంతం నారి చిత్రంలో లీనమవుతారు. అలాంటి ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఆమని నటన నారి చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మిగతా నటీనటులంతా ఈ చిత్రానికి తమ నటనతో అందాన్ని తీసుకొచ్చారు. సాంకేతికంగా ఉన్నతంగా ఉందీ మూవీ. వినోద్ స్వరపర్చిన పాటలు మరో హైలైట్ గా నిలుస్తాయి. నారి వంటి మూవీ చేసిన శ్రీమతి శశి వంటిపల్లి, సూర్య వంటిపల్లి అభినందనీయులు. ఈ వారం థియేటర్స్ లో సకుటుంబంగా చూడాల్సిన చిత్రం నారి.
రేటింగ్ 3