• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

ఎన్నికల్లో బెట్టింగ్ డబ్బులతో పరారైన మధ్యవర్తులు

admin by admin
June 6, 2024
in politics
0 0
0
ఎన్నికల్లో బెట్టింగ్ డబ్బులతో పరారైన మధ్యవర్తులు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాలలో కోట్లాది రూపాయలు పందాలు జరిగాయి. పందెం రాయుళ్లు ముందుగా పందాలు కాసేటప్పుడు ఓ మధ్యవర్తి సమక్షంలో పందేలు కాస్తారు. పందేలు కోసే ఇద్దరు వ్యక్తులు సంఘటన డబ్బులను మధ్యవర్తి సమక్షంలో ఉంచుతారు. పందెం గెలిచిన తర్వాత మధ్యవర్తి తన కమిషన్ తీసుకుని మిగిలిన పందెం డబ్బులు గెలిచిన వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది.

ఆ క్రమంలోనే భీమవరం సమీపంలో రాయలం గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద ఇరు పార్టీల పందం రాయుళ్ళఉ పెద్ద మనిషిగా ఉంచారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాలకు చెందిన పందెం రాయుళ్ళు బెట్టింగ్ కోసం తెచ్చిన డబ్బును సదరు మధ్యవర్తి దగ్గర ఉంచి గెలిచిన తర్వాత 5 పర్సెంట్ కమిషన్ తీసుకుని పందెంలో నెగ్గిన వ్యక్తికి మిగతా డబ్బులు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు.

ఇలా మొత్తం సుమారు 30 కోట్ల రూపాయలపైనే ఆ మధ్యవర్తి వద్ద పందాలు జరిగాయి. ఎన్నికల అనంతరం పందాలు గెలిచిన వ్యక్తులు సంతోషంగా తమకు డబ్బు వస్తుందని ఆశించారు. ఎంతో ఆశగా పందెంలో గెలిచిన డబ్బు కోసం మధ్యవర్తి వద్దకు వెళ్లగా, అతని జాడ ఎవరికీ చిక్కలేదు. దాంతో అతను ఎక్కడికి వెళ్ళాడా అని ఆరా తీశారు. కానీ అతను ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయామని గ్రహించారు.

మధ్యవర్తి బంధువులు కుటుంబ సభ్యులు సైతం అతని గురించి సమాచారం తెలియదు అన్నట్లుగా వ్యవహరించడంతో ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పందెం రాయుళ్లు గగ్గోలు పెడుతున్నారు.

ఒకవేళ పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాలన్న పందెం కాయడం చట్ట వ్యతిరేకం. అందుకే ఫిర్యాదు చేస్తే తమపైనే కేసులు నమోదు చేస్తారేమో అని భయపడుతున్నారు. పందాలు కాసిన వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి ఆ మధ్యవర్తి కోసం వెతుకులాట మొదలుపెట్టారట.

పల్నాడు జిల్లా : రొంపిచర్ల మండలం పరగటిచర్లకి చెందిన ఆదినారాయణ అనే మధ్యవర్తి  వద్ద ఏడు కోట్ల రూపాయలు ఎన్నికల బెట్టింగ్  డబ్బులు కలిపిన  బెట్టింగ్ రాయుళ్లు..రొంపిచర్ల గ్రామంలో వెంకయ్య అనే మధ్యవర్తి కోటిన్నరతో పరారీ..నరసరావుపేట మండలం దొండపాడులో కోటిన్నరతో మరో మధ్యవర్తి పరార్..నిన్న రాత్రి నుంచి సెల్ స్విచ్చాఫ్ చేసుకుని, కనపడకుండా పోయిన మధ్యవర్తులు..మధ్యవర్తులు పరారు అవ్వడంతో గగ్గోలు పెడుతున్న బాధితులు….. సోషల్ మీడియా సమాచారం మేరకు పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

Previous Post

మరో చంద్రబాబును చూస్తారు..ఎంపీలతో బాబు కీలక వ్యాఖ్యలు

Next Post

నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు: చంద్రబాబు

Next Post
నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు: చంద్రబాబు

నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు: చంద్రబాబు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి
movies

వారాహి సిల్వర్ జ్యువెలరీ ను ప్రారంభించిన సినీనటుడు తేజ సజ్జ, మరియు సినీనటి మీనాక్షి చౌదరి

by admin
March 23, 2026
0

...

Read more
కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

కొంపల్లిలో ఘనంగా “హివాగ” లగ్జరీ బ్యూటీ క్లినిక్ ప్రారంభం

March 21, 2026
ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

ఈ నెలాఖరుకు “అహోం” ప్రారంభం

March 21, 2026
హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

హైద్రాబాద్ లో రాక్‌స్టార్ అనిరుధ్ XV టూర్ …

March 20, 2026
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో కొత్త సినిమా…

March 20, 2026
వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

వర్టెక్స్ 33 వెస్ట్‌లో గృహ కొనుగోలుదారులకు అద్భుతమైన అవకాశం

March 20, 2026
మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్  ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

మియాపూర్‌లో వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్‌ అద్భుతమైన లిమిటెడ్ EMI హాలిడే ఆఫర్‌ ప్రకటించింది…

March 20, 2026
రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

రివ్యూ: పవన్ కళ్యాణ్ ​ “ఉస్తాద్ భగత్ సింగ్”

March 19, 2026
‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ నుంచి ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ విడుదల

March 18, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In