• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

‘గుంటూరు కారం’ నుంచి రెండో గీతం ‘ఓ మై బేబీ’ విడుదల

admin by admin
December 13, 2023
in movies
0 0
0
‘గుంటూరు కారం’ నుంచి రెండో గీతం ‘ఓ మై బేబీ’ విడుదల
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్‌ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్, ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ తో చేతులు కలిపింది. తమ సంస్థలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ కోసం అగ్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చిన్నబాబు) ఈ కలయికను తీసుకువచ్చారు.

సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి టీజర్ వైరల్‌గా మారింది మరియు మహేష్ బాబు యొక్క కొత్త మాస్ లుక్‌ను అభిమానులు ఎంతగానో ఇష్టపడ్డారు. నవంబర్ 11న చిత్ర బృందం మొదటి గీతం “ధమ్ మసాలా”ని విడుదల చేయగా, అది తెలుగు ఆల్బమ్‌లలో టాప్ చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది.

ఇప్పుడు మేకర్స్ మెలోడియస్ సౌండ్‌ట్రాక్ “ఓ మై బేబీ”ని రెండవ గీతంగా విడుదల చేశారు. ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆయన “ధమ్ మసాలా” పాటకు వచ్చిన స్పందనతో చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఈ మెలోడీ గీతానికి కూడా అద్భుతమైన స్పందన లభిస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

త్రివిక్రమ్-మహేష్ బాబు, త్రివిక్రమ్-థమన్ కలయికల్లో పలు చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లు వచ్చాయి. ఇప్పుడు ‘గుంటూరు కారం’ కూడా మరో భారీ చార్ట్ బస్టర్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను నిజం చేస్తూ ”ధమ్ మసాలా” బాటలోనే “ఓ మై బేబీ” పాట కూడా భారీ చార్ట్‌బస్టర్‌గా మారనుంది. ఈ పాట శీతాకాలపు ఉదయం ఆనందకరమైన మెలోడీని వింటూ పొగలు కక్కే కాఫీ తాగుతున్న అనుభూతిని కలిగిస్తుందని బృందం పేర్కొంది.

ఈ మెలోడీ గీతాన్ని అత్యంత ప్రతిభావంతులైన గాయకులలో ఒకరైన శిల్పా రావు పాడారు. ఈ సోల్ ఫుల్ మెలోడీకి ‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. శిల్పా రావు యొక్క మనోహరమైన స్వరం ఈ పాటకు ఎంతో అందాన్ని తీసుకొచ్చింది. రామజోగయ్య సాహిత్యానికి ఆమె స్వరం తోడై మ్యాజిక్ చేసింది. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరిన ఈ పాట శ్రోతలను కట్టిపడేస్తోంది.

రెండు పాటల్లోని ఆహార పదార్థాల పోలిక నేపథ్యం అభిమానులను మరియు ప్రేక్షకులను మరోసారి తెరపై త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మ్యాజిక్ కోసం ఎదురుచూసేలా చేసింది. అత్యంత ప్రతిభావంతురాలైన అందాల తార శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.

మీనాక్షి చౌదరి మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటిసున్నారు. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ని నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

గుంటూరు కారం చిత్రం సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటిస్తుంది.

Previous Post

ఉద్దానానికి ఊపిరిలూదిన జగన్

Next Post

మైనార్టీ కోటాలో మంత్రి వర్గంలోకి అజహరే బెటర్..!!!

Next Post
మైనార్టీ కోటాలో మంత్రి వర్గంలోకి అజహరే బెటర్..!!!

మైనార్టీ కోటాలో మంత్రి వర్గంలోకి అజహరే బెటర్..!!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!
movies

ముందుచూపున్న దర్శకుడు జయశంకర్: అప్పట్లో ఆయన చేసిన ‘కాన్సెప్ట్స్’.. ఇప్పుడు బాక్సాఫీస్ ‘హిట్స్’!

by admin
April 7, 2026
0

...

Read more
నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

నిర్మాత కేఎస్ రామారావు, డైరెక్టర్ వి.వి.వినాయక్ అతిథులుగా ఘనంగా “అహోం” సినిమా ప్రారంభం

April 7, 2026
ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

ఘనంగా శ్రీజ స్వీయ దర్శకత్వంలో నిర్మించి హీరోయిన్ గా నటించిన “కొత్త కొత్తగా” సాంగ్ ఆల్బమ్ లాంఛ్

April 7, 2026
విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

విచిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన దర్శకులు విఎన్. ఆదిత్య

April 6, 2026
జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

జర్నలిస్టు మిత్రుల చేతుల మీదుగా రఘుకుంచె “గేదెల రాజు” సినిమా ట్రైలర్ రిలీజ్

April 4, 2026
హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

హీరోయిన్ మానస వారణాశి చేతుల మీదుగా నెల్లూరులో లాడియా (LADIA) 6వ స్టోర్ ప్రారంభం

April 4, 2026
టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్  అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

టాలీవుడ్ యువ హీరోలు నటించిన “క్విట్ డ్రగ్స్” థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ అండ్ పోస్టర్ ను లాంచ్ చేసిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

April 3, 2026
ఏప్రిల్ 17న  గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’  విడుదల

ఏప్రిల్ 17న గ్రాండ్ గా ధియేటర్ లలో ‘కాల గమనం’ విడుదల

March 31, 2026
మే 22న థియేటర్స్  సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన  హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

మే 22న థియేటర్స్ సందడి చెయ్యనున్న ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన హార్రర్ త్రిల్లర్ చిత్రం “విచిత్ర”

March 29, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In