యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ “మధురం”. సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..
చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ… ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మధురం చిత్రాన్ని చాలా రిచ్ గా నిర్మించారు.. అన్నారు.
నిర్మాత యం. బంగార్రాజు మాట్లాడుతూ… మా దర్శకుడు రాజేష్ చెప్పిన కథ అధ్భుతంగా నచ్చింది.. కొత్తదనం వున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. అలాగే మా “మధురం” సినిమా కూడా చాలా కొత్తగా నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా వుంటుంది. కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం మాకు ఉంది. ఇటీవలే మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు.. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయనకి మా కృతజ్ఞతలు. హైదారాబాద్, పాలకొల్లు, ఆచంట, సిద్ధాంతం, రావులపాలెం, కోనసీమ ఏరియాలో షూటింగ్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి.. మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు.. పాటలన్నీ కూడా కోనసీమ, మారెడుమిల్లి, రంపచోడవరం వంటి సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరించాం.. షూటింగ్ అంతా పూర్తి అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి.. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి సమ్మర్ లోనే సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేస్తాం అన్నారు.
హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ… రీసెంట్ గా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను.. అలాగే కొన్ని హిట్ మూవీస్ లో మంచి క్యారెక్టర్స్ చేశాను. అవి చూసి డైరెక్టర్ రాజేష్, మా నిర్మాత బంగార్రాజు గారు ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని ఇచ్చారు.. వారికి నా థాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే టీనేజ్ లవ్ స్టొరీ ఇది. నా క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అయ్యేలా వుంటుంది.. యూత్ కే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చేలా ఈ చిత్రం వుంటుంది.. రీసెంట్ గా మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విశ్వక్ సేన్ గారికి నా స్పెషల్ థాంక్స్.. అన్నారు.
ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కోటేశ్వర రావు (బస్ స్టాప్), కిట్టయ్య , యప్. యం. బాబాయ్, దివ్య శ్రీ, సమ్యు రెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య, ఉష, అప్పు, రామ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరామెన్; మనోహర్ కొల్లి, మ్యూజిక్; వెంకీ వీణ, పాటలు; రాఖీ, ఎడిటర్; ఎన్టీఆర్, పి. ఆర్. ఓ; జిల్లా సురేష్, నిర్మాత; యం. బంగార్రాజు, కథ-మాటలు-స్రీన్ ప్లే- దర్శకత్వం; రాజేష్ చికిలే
“Madhuram” Post-production Works Going On At A Brisk Pace
“Madhuram” is a teenage love story starring Young Hero Uday Raj is being produced by passionate producer M. Bangarraju under the direction of young talented director Rajesh Chikile under the banner of Sri Venkateswara Entertainment. The movie which is getting its shape with a new love story, has completed its shooting and is carrying out post-production activities at a fast pace.
Film director Rajesh Chikile said ” Madhuram movie is a teenage love story set in the background of 1990 showing how the school atmosphere, games, riots and quarrels of that time were for today’s generation. Our producer Bangarraju has made the film Madhuram very lavishly without compromising on the quality even though the budget is more than what he thought”
Producer M. Bangarraju said… I really liked the story told by our director Rajesh. Telugu audience always appreciates new movies. Also our movie “Madhuram” is very new and will connect with today’s generation. We are sure that it will be a big hit. Recently our movie’s first look poster was released by hero Vishwak Sen. It got a very good response. We are thankful to him. The shooting was done in Hyderabad, Palakollu, Achanta, Siddhantam, Ravulapalem, and Konaseema area. There are five songs in this movie. Our music director Venky Veena gave amazing songs. All the songs have also been shot in beautiful places like Konaseema, Maredumilli, and Rampachodavaram. The shooting has been completed. At present the post-production works have reached the final stage. Soon the censor will be completed and the film will be released grandly in the summer itself”.
*Hero Uday Raj said,* “Recently I have done some short films and I have done good characters in some hit movies. After seeing them, director Rajesh and our producer Bangarraju gave me an opportunity to act as a hero in this film. My thanks to them. Rhis is a teenage love story in Village Back Drop. My character is relatable to everyone. Apart from the youth, the family audience will also like this film. My special thanks to Vishwak Sen who recently released the first look poster of our film”.
*Uday Raj and Vaishnavi Singh are acting as the lead pair in this film, Koteswara Rao (Bus Stop), Kittayya,Babai, Divya Sri, Samyu Reddy, Jabardasth Aishwarya, Usha, Appu, Ram and others are acting in this film. Cinematography: Manohar Kolli, Music: Venky Veena, Songs: Rakhi, Editor: NTR, PRO: Jilla Suresh, Producer: M. Bangarraju, Story-Screen Play- Direction; Rajesh Chikile*