హైదరాబాద్ వస్త్ర ప్రపంచంలో మరో రంగుల ప్రపంచం 3 సంవత్సరాల క్రితం ఆవిష్కృతమైంది. కూకట్ పల్లిలో “ఐశ్వర్య సిల్క్స్” 3వ వార్షికోత్సవం సందర్భగా షోరూంను ప్రముఖ హీరో ఆట సందీప్ , ఆయన సతీమణి జ్యోతి రాజ్, యాంకర్ జాను నేడు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య సిల్క్స్ ఎండీ లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భగా హీరో సందీప్ మాట్లాడుతూ “లక్ష్మి గారు ధర్మవరం కు చెందిన వీవర్స్ సామాజిక వర్గానికి చెందిన సాధారణ గృహిణి. ఈ రోజుఆమె అంచెలంచెలుగా ఎదుగుతున్న తీరు అభినందనీయం. ఆమె హైదరాబాద్ లో రెండు షో రూమ్ లు రన్ చేస్తున్నారు. ఆమె ఫ్యూచర్ లో మరిన్ని ఐశ్వర్య సిల్క్స్ బ్రాంచీలు స్థాపించాలని కోరుకుంటున్నాను.”అని అన్నారు.
ఈ సందర్భగా ఐశ్వర్య సిల్క్స్ ఎమ్ డి .లక్ష్మి మాట్లాడుతూ ” నేటి పోటీ ప్రపంచంలో యువతి యవకుల అభిరుచులకు అనుగుణంగా మ షోరూం ను ఏర్పాటు చేయడం జరిగింది. అతి తక్కువ ధరలలో ఎక్కవ క్వాలిటీ వుండే పట్టు చీరలను ను మా కస్టమర్లకు అందించేందుకు ఎప్పుడు ముందు ఉంటాము.మా షో రూం 3వ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ హీరో సందీప్ గారు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ గారు , యాంకర్ జాను గారు సందర్శించడం సంతోషంగా ఉంది”. అని అన్నారు.