ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల హడావిడి ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాగైనా ఈసారి కూడా పదవి దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలి అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది బీఆర్‌ఎస్. మరోపక్క కేంద్రంలో ఎలాగో మహావానే జరుగుతోంది ఇక తెలుగు రాష్ట్రాల పై కూడా మేమే ఆధిపత్యం తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో బీజేపీ తన పావులను కదుపుతోంది. ఎన్నో సంవత్సరాల పాటు అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోకపోతే భవిష్యత్తు కష్టమనే భయంతో తెగించి బరిలోకి దిగి ఉంది. కానీ ఎన్నికలు ఎవరికి పట్టం కడతాయి అన్న విషయం పై ఎవరికి స్పష్టత లేదు.
ఈ క్రమంలో బుధవారం నాడు విడుదలైన న్యూస్ స్టాప్ తెలంగాణ స్టేట్ సర్వే నివేదిక ప్రకారం.. ఈసారి కూడా అందరూ ఊహించినట్లే బీఆర్‌ఎస్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. నిపుణుల దగ్గర నవంబర్ 16 నుంచి 21 మధ్య ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో సుమారు 1,19,000 నమూనాలు పరిగణలోకి తీసుకొని పరిశీలించారు. ఈ సర్వే నివేదిక ప్రకారం రాబోయే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. అక్కడక్కడ వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ సమర్థించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అని సర్వేలో స్పష్టమైనది.
యువత ,విద్యార్థులలో కేసీఆర్ ప్రభుత్వం పై ,వారు ఇస్తున్న పథకాల పై ఎంతో పాజిటివిటీ కనిపిస్తోంది. ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ,వనరులు సమకూర్చడంలో కేటీఆర్ ముందంజలో ఉంటాడు. ఇది నిజంగా కేసీఆర్ ప్రభుత్వానికి ఎనలేని సపోర్ట్. వీటితో పాటుగా డబల్ బెడ్ రూమ్ గృహాల మంజూరు పథకాలు, వ్యవసాయ రుణమాఫీ, నిరుద్యోగ ఆర్థిక సహాయం ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఆచరించిన ఎన్నో పథకాల లబ్ధిదారులు ఈ ప్రభుత్వానికే తమ ఓటు అంటున్నారు.
కాంగ్రెస్ కాస్త జోరు పెట్టి ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం అయితే కనిపించేలా లేదు. కానీ గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్ సీట్ల శాతం లో పెరుగుదల కనిపిస్తుంది. సర్వే ప్రకారం టిఆర్ఎస్ పార్టీకు 65 నుంచి 76 సీట్ల మధ్యలో గెలుపు ఉంటుందని అంచనా. తర్వాత రెండవ స్థానాలలో కాంగ్రెస్ 32 నుంచి 41 సీట్లు ఖాతాలో వేసుకునే ఆస్కారం కనిపిస్తోంది. ఇప్పటివరకు బీఆర్‌ఎస్ అందిస్తున్న స్కీములకు అప్గ్రేడ్ వర్షన్ గా కాంగ్రెస్ అభయమిస్తున్నప్పటికీ.. ఫలితం మాత్రం బీఆర్‌ఎస్ పక్కే ఎక్కువగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం అస్థిరంగా ఉంటుంది అన్న ఒక అభిప్రాయం.. కాంగ్రెస్ నాయకుల వాగ్దానాలపై ప్రజలలో సన్నగిల్లిన నమ్మకం.. వల్ల ఈ పార్టీకి అనుకున్న మ్యాజిక్ ఫిగర్ దక్కేలా కనిపించడం లేదు.
కేంద్రంలో బలంగా విస్తరించిన బిజెపి మాత్రం తెలంగాణలో తన బల ప్రదర్శన చేయలేకపోతోంది. కర్ణాటక ఎన్నికలు జరిగేటంతవరకు తెలంగాణలో ఒక బలమైన పార్టీగా రెండవ స్థానంలో ప్రధాన ప్రత్యర్థుడిగా వ్యవహరిస్తున్న బిజెపి సర్వే లెక్కల ప్రకారం ఏఐఎంఐఎం కంటే కూడా వెనకబడిన పరిస్థితిలో ఉంది. సర్వే రిపోర్ట్ ప్రకారం బీజేపీకి మూడు నుంచి నాలుగు సీట్ల వరకు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇక మిగిలిన పార్టీల పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది. ఇప్పటివరకు తెలంగాణలో త్రిముఖ పోరుగా ఉంటుంది అనుకున్న ఎన్నికలు కాస్త.. రెండు పార్టీల మధ్య పోటాపోటీగా ఉండేలా ఉన్నాయి. మరి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే..