* నారా లోకేష్ మాటలకు ఫైర్ అవుతున్న జనసేన క్యాడర్..
జనాలను ముందుండి నడిపిస్తాను అని జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ పదేళ్లు గడుస్తున్న ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంపై జనసేన కార్యకర్తలలో ఆందోళన నెలకొని ఉంది. వచ్చే ఐదు సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు ఉంటాడు అని లోకేష్ అన్న మాటలపై జనసేనలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. అవసరమైనప్పుడు వాడుకొని కూరలో కరివేపాకుల పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పక్కన పడేస్తున్నాడు అని జనసైనికులు భావిస్తున్నారు.
జనసేన పొత్తు పెట్టుకోవడంతో టీడీపి ఎంతోకొంత లాభ పడింది అన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కానీ జనసైనికులు ముందు ఉండి ఎన్నో పనుల్లో చేదోడు వాదోడుగా నిలిచిన విషయాన్ని పట్టించుకోకుండా.. టిడిపి వ్యవహరిస్తున్న తీరు జనసైనికులను కలవరపరుస్తుంది. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో సంఘీభావం ప్రకటించడంతోపాటు పొత్తు గురించి చర్చించి.. నియమాలకు కట్టుబడి ఉన్నాడు పవన్. మరి ఈ నేపథ్యంలో ఏకపక్షంగా సీఎం చంద్రబాబు అవుతాడు అని ఎలా ప్రకటిస్తారు అంటున్నారు జనసైనికులు.
టిడిపి తో కలిసి ఉండడం కోసం జనసైనికులు ఎన్నో అవమానాలను సైతం అధిగమించి ముందుకు వచ్చారు. కేంద్రంలో బిజెపితో సైతం వైరం పెట్టుకోవడానికి వారు వెనకాడ లేదు. మరి ఎన్ని త్యాగాలు చేసినప్పటికీ.. ఇంతగా అవమానించడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుంది అని మండిపడుతున్నారు జనసైనికులు. ప్యాకేజీ స్టార్ అని.. టిడిపి దగ్గర జనసేన ను తాకట్టు పెట్టావు అని.. ఎంతమంది ఎన్ని మాటలు అన్న పవన్ మౌనంగా ఉన్నాడు. మరోపక్క పవన్ మాత్రం చంద్రబాబుకు విపరీతమైన గౌరవం ఇస్తున్నారని.. కానీ ఆయన ఇస్తున్న మర్యాదకు తగిన ప్రతిఫలం దక్కడం లేదని వాళ్ళు బాధపడుతున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు తమ పార్టీ కు సీట్లు కేటాయిస్తాడా లేదా? అన్న అనుమానం జనసేన పార్టీలో వ్యక్తమవుతోంది. మేమంతా పవన్ కోసం పోరాటం చేస్తుంటే ఆయన వెళ్లి చంద్రబాబు పల్లకి మోస్తున్నాడు.. ఇది ఎంతవరకు సమంజసం అని భావిస్తున్నారు జనసేన పార్టీ కార్యకర్తలు. ఏదైనా వచ్చే ఎన్నికల్లోపు పవన్ ఇదే వైఖరి కొనసాగిస్తే..జనసేన పార్టీ ఇంకా బలహీనపడే చాన్స్ ఉంటుందని వాళ్ళు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదే పార్టీలో ఉండాలా ? లేక వేరే పార్టీ గూటికి చేరాలా? అన్న విషయంపై ప్రస్తుత పార్టీలో జోరుగా చర్చలు జరుపుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న ఈవేళ జనసేనలో ఇటువంటి చర్చలు ఏ పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.