నటీనటులు : సాగర్ కిరణ్ , లావణ్య , త్రిభువన్ రెడ్డి , శ్రేయ , భాగ్య శ్రీ , రాహుల్ , నికిల్ జాకబ్ , మరియు రామ్ బాబు
దర్శకత్వం : విశ్వనాధ్. బి.
నిర్మాతలు : వేణు బచ్చు
సంగీతం : అర్మాన్ మెరుగు,
సినిమాటోగ్రఫర్ : గురుప్రసాద్. జె,
ఎడిటర్ : సంపత్ కుమార్ ఐలాపురం,
కొత్త చిత్రం 3E ద్వార వెండి తెరకు పరిచయం అవుతున్న సాగర్ కిరణ్ లేటెస్ట్ మూవీ 3E విడుదల అయ్యింది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు బాగానే ఉన్నాయి. మెడికల్ మాఫియా లో జరుగుతున్నా దారుణాలను తెలుసుక్కన్న ఒక అమ్మాయి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింగిందో అనే నేపథ్యంలో ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథ:
సిటీ లో బాగా పేరున్న ప్రముఖ లాయర్ శ్రీకాంత్ దగ్గర జూనియర్ లాయర్ గా వున్నా అనిరుద్ ( సాగర్ ) , అమ్రిత కేసును చాలెంజ్ గా తీసుకోని తన సీనియర్ లాయర్ శ్రీకాంత్ పై కేసు ఎలా గెలిచాడు , కోర్టుకు నిజమైన నేరస్తులను ఎలా ఆప్పగించాడు , నిజమైన నేరస్తురాలు అమ్రితనే అని చెప్పిన C.I. మహేష్ బాబు కి ఎలాంటి నిజాలను తెలియ చేశాడు , హంతకుడు ఆకాష్ ( త్రిభువన్ రెడ్డి ) ని ఎలా చట్టానికి అప్పగించాడు , ఇంతకు ఆకాష్ ఎవ్వరు ? చనిపోయిన అమ్మాయి విశేష ఎవ్వరు , విశేష ను ను ఎందుకు చంపాడు?
ప్లస్ పాయింట్స్:
సినిమా కాన్సెప్ట్ మరియు దాని తెరకెక్కించిన విధానం ఆకట్టుకొనేలా సాగుతుంది. ‘‘ప్రస్తుత సమాజంలో క్రైమ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి క్రైమ్‌కి సంబంధించి ఫైల్ అయిన కేసుల స్పూర్తితో ఓ అద్భుతమైన రీతిలో తెరపై ఉత్కంఠంగా ఆవిష్కరించడంలో దర్శకుడు విజయం సాధించాడు అని చెప్పాలి.
వెండితెరకు పరిచయం అయిన సాగర్ కిరణ్ నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో అంచనాలకు మించి నటించారు. పాత్రకు తగ్గ విధంగా తన బాడీ లాంగ్వేజ్ మార్చుకున్న తీరు, కోర్టు సన్నివేశాల్లో తన నటన ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన లావణ్య ఒక అమాయకురాలిగా తన పాత్ర పరిధిలో బాగా నటించింది , సీనియర్ లాయర్ గా రాహుల్ , C.I. గా నికిల్ జాకబ్ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు , కథలో వుండే ముక్యమైన నెగటివ్ రోల్ లో త్రిభువన్ రెడ్డి బాగా గుర్తుండి పోతాడు,
ఇక సపోర్టింగ్ పాత్రలలో కనిపించిన భాగ్య శ్రీ , శ్రేయ , రామ్ బాబు మరియు ప్రశాంత్ తో పాటు మిగతా నటి నటులు వారి పాత్ర మేరకు అలరించారు.
కథకు తగ్గట్టుగా సెట్టింగ్స్, పరిసరాలు ఎంచుకున్న తీరు బాగుంది. మొదటి సగంకి మించి రెండవ భాగం మరింత ఉత్కంఠ గా సాగడం ఈ చిత్రం కి కలిసొచ్చే మరో అంశం. కథలో మలుపులను దర్శకుడు చక్కగా ఆవిష్కరించి, ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించారు.
సాంకేతిక విభాగం:
ఇక ప్రవీణ్ MGK అందించిన బీజీఎమ్ సినిమాలోని ఉత్కంఠ కలిగే సన్నివేశాలు గ్రిప్పింగ్ గా సాగడంతో ఎంతో కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ఆయన మ్యూజిక్ సన్నివేశాలకు ప్రాణం పోసింది. సినిమాలో నిర్మాణ విలువలు కూడా బాగా ఉన్నాయి. అలాగే ఎడిటింగ్ కూడా సినిమాకు తగ్గట్లుగా ఆకట్టుకుంది. సన్నివేశాలు ప్రేక్షకుడికి కొత్త అనుభూతి పంచడంలో కెమెరా పనితనం ఉపయోగపడింది.
కథ ఎంచుకున్న విదానం , దానిని వెండితెరకు పరిచయం చేయటంలో దర్శకుడు విజయం సాధించారు. కొత్త ప్రయోగాలకు చాలెంజ్ గా తీసుకుని దర్శకుడు అతని టీం అద్బుతంగా ప్రెసెంట్ చేశారు. ఎక్కడా నిరాశ కలగకుండా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు.
తీర్పు:
మొత్తంగా చెప్పాలంటే కొత్త దర్శకుడు మంచి బ్రేక్ ఇచ్చే చిత్రం అనడంలో సందేహం లేదు. ఈ చిత్రం ఎక్కడా ప్రేక్షకుడిని నిరాశపరచకుండా ఆద్యంతం ఉత్కంఠగా సాగే క్రైమ్ థ్రిల్లర్ . రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఆశించి సినిమాకు వెళ్లేవారిని ఈ చిత్రం అంతగా ఆకట్టుకోకపోవచ్చు, కానీ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకుడికి ‘3E’ చిత్రం మంచి అనుభూతిని పంచుతుంది. ఈ వారానికి 3E మూవీ బెస్ట్ ఛాయిస్ అనడంలో సందేహం లేదు.
రేటింగ్: 3