• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

భలే ఉన్నాడే… మెప్పిస్తాడు

admin by admin
September 12, 2024
in movies, reviews
0 0
0
భలే ఉన్నాడే… మెప్పిస్తాడు
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 13న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయింది. మరి ఈ చిత్రం ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: రాధా(రాజ్ తరుణ్) పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కి అమ్మాయిలకు చీరలు కడుతూ శారీ డ్రాపర్ గా పనిచేస్తూ ఉంటాడు. రాధ తల్లి గౌరీ(అభిరామి) బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటుంది. అదే బ్యాంక్ లో కృష్ణ(మనీషా కందుకూర్) చేరుతుంది. రాధ చేసే వంట బాగా నచ్చి కృష్ణ, గౌరీ దగ్గరవుతారు. ఆ వంటతో రాధని ఇష్టపడుతుంది కృష్ణ. ఒకరికొకరు పరిచయం లేకుండానే ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడతారు. అనుకోకుండా కృష్ణ ఫ్రెండ్(ప్రీతీ ఇందు) పెళ్ళికి రాధనే శారీ డ్రాపర్ కావడంతో ఒకరికొకరు తెలియకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవలు అవుతాయి. అనుకోకుండా గౌరీ వల్ల ఇద్దరూ కలిసి ఆ తర్వాత ప్రేమించి ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. రాధా కృష్ణ ఎంగేజ్మెంట్ లో కృష్ణ ఫ్రెండ్ వచ్చి తన భర్త సంసారానికి పనికిరాడు అని అతనికి డైవర్స్ ఇస్తున్నాను అని చెప్పి, రాధా కూడా అమ్మాయిలకు దూరంగా ఉంటాడు, నువ్వు రెచ్చగొట్టినా దూరం పెడతాడు ఆలోచించు అని చెప్పడంతో కృష్ణ కూడా రాధా సంసారానికి పనికిరాడేమో అని ఫిక్స్ అయిపోతుంది. ఆ సమస్య కోసం రాధకు చెప్పకుండా కృష్ణ ఒక ఆశ్రమానికి తీసుకెళ్తుంది. కృష్ణ అనుమానం తీరుతుందా? తనని అనుమానిస్తోంది అని రాధకు తెలుస్తుందా? ఆశ్రమంలో ఏం జరిగింది? రాధా నాన్న ఎవరు? అసలు రాధా ఎందుకు అమ్మాయిలకు దూరంగా ఉంటాడు? రాధా కృష్ణల పెళ్లి జరిగిందా తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

కథ… కథనం విశ్లేషణ.. ఈ రోజుల్లో అబ్బాయిలు మంచిగా ఉంటే వీడు అబ్బాయా అని అనుమానిస్తున్నారు. బయట సొసైటీలో జరిగే ఈ పాయింట్ ని తీసుకొని ఫుల్ లెంగ్త్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా భలే ఉన్నాడే సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా రాధ, కృష్ణ క్యారెక్టర్స్ గురించి చెప్తూ వారిద్దరి మధ్య లవ్ స్టోరీతో ఫుల్ కామెడీగా చూపించారు. సెకండ్ హాఫ్ లో రాధ కృష్ణ మధ్య ప్రేమ సన్నివేశాలు, రాధ తల్లి కథతో మంచి ఎమోషన్ ని పండించారు. దర్శకుడు ఒక కొత్త కథని చాలా బాగా చెప్పాడు. అయితే సెకండ్ హాఫ్ లో రచ్చ రవి చేసే కొన్ని క్రింజ్ కామెడీ సీన్స్, కొంత సాగదీత తప్ప సినిమా అంతా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. రాజ్ తరుణ్ క్యారెక్టర్ ని చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ లో హీరో – హీరోయిన్ లవ్ స్టోరీ కూడా కొత్తగా రాసుకున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ లో కొంత మంది అబ్బాయిలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, అమ్మాయిలకు దూరంగా ఉంటూ, ఇంట్లో వాళ్లకు హెల్ప్ చేస్తుంటే ఎందుకు చేతకానివాడిలాగా చూస్తున్నారు. వాడు అబ్బాయే కాదు అనేలా చూస్తున్నారు అనే పాయింట్ ని చాలా బాగా చూపించారు. అలాగే పెళ్ళికి ముందే తప్పు చేసి కష్టాలు పడుతున్నారు అనే అంశాన్ని ఎమోషనల్ గా ఆలోచించే విధంగా చూపించారు. గత కొన్ని రోజులుగా రాజ్ తరుణ్ ఓ ఇష్యూతో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ ఇష్యూ పక్కన పెట్టి సినిమా పాజిటివ్ టాక్ తో జనాల్లో వ్యాప్తి చెందితే సినిమా హిట్ అవ్వడం పక్కా. మూవీ టీమ్ కూడా ఇంకొంచెం ప్రమోషన్స్ చేస్తే జనాలకు మరింత రీచ్ అవుతుంది ఈ సినిమా.

నటీనటుల పర్ఫార్మెన్స్.. రాజ్ తరుణ్ అద్భుతంగా నటించాడు. శారీ డ్రాపర్ గా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. చాలా రోజుల తర్వాత రాజ్ తరుణ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మనీషా కందుకూర్ కూడా తన పాత్రలో నటనతో, అందంతో కూడా మెప్పించింది. అమ్మ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ అభిరామి అదరగొట్టేసింది. గెస్ట్ పాత్రలో లెజెండరీ దర్శకులు సింగీతం శ్రీనివాస్, లీలా శ్యాంసన్ క్యూట్ గా మెప్పించారు. హైపర్ ఆది, సుదర్శన్, తమిళ్ స్టార్ కమెడియన్ VTV గణేష్ నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. గోపరాజు రమణ, అమ్ము అభిరామి, ఇందు ప్రీతీ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకి సాంగ్స్ చాలా ప్లస్. చాలా రోజుల తర్వాత కొత్తగా అనిపించే మంచి సాంగ్స్ వినిపించారు. అన్ని పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. కొత్త కథని సింపుల్ స్క్రీన్ ప్లేతో ఫ్రెష్ గా చూపించాడు దర్శకుడు శివ సాయి వర్ధన్. గతంలో పలు షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మెప్పించిన శివసాయి దర్శకుడిగా మొదటి సినిమాతో సక్సెస్ అయ్యాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. నిర్మాణ పరంగా సినిమాకి బాగానే ఖర్చుపెట్టి క్వాలిటీ అవుట్ పుట్ ఇచ్చారు నిర్మాత కరుణ్ కుమార్. సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై క్వాలిటీగా కనిపిస్తుంది.

రేటింగ్: 3.25

Tags: Hero Raj Tarun’s Bhale Unnade movie review
Previous Post

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరద బాధతుల సహాయార్థం తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించిన తెలుగు టెలివిజన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్

Next Post

ఏపీ సిఎంఆర్ఎఫ్ కు విరాళాల వెల్లువ…

Next Post
ఏపీ సిఎంఆర్ఎఫ్ కు విరాళాల వెల్లువ…

ఏపీ సిఎంఆర్ఎఫ్ కు విరాళాల వెల్లువ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం
movies

హైదరాబాద్‌లో అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్‌పో ‘టైమ్స్ హోమ్ హంట్ 6.0’ ఘనంగా ప్రారంభం

by admin
June 13, 2026
0

...

Read more
‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

‘టెలివిజన్ అండ్ ఓటిటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ సౌత్’(టాప్కోస్)ను ఏర్పాటు చేసిన టెలివిజన్ ప్రొడ్యూసర్స్

June 12, 2026
రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

రెబల్ స్టార్ ప్రభాస్ “ఈశ్వర్” సినిమా రీరిలీజ్ సందర్భంగా ట్రిబ్యూట్ గా “సాV3” మూవీ టీమ్ స్పెషల్ ప్రెస్ మీట్

June 11, 2026
“రాను.. నే బొంబాయికి రాను”  సాంగ్ ఫేమ్  లిఖిత  హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

“రాను.. నే బొంబాయికి రాను” సాంగ్ ఫేమ్ లిఖిత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం…

May 31, 2026
ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

ఖమ్మంలో ప్రారంభమైన భారతదేశపు అతిపెద్ద ల్యాబ్-గ్రోన్ డైమండ్ జ్యువెలరీ స్టోర్ ‘లాడియా’ ఏడో షోరూమ్

May 31, 2026
జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

జూన్‌లో ప్రారంభం కానున్న తెలుగు తొలి ట్రావెల్ OTT ప్లాట్‌ఫామ్ – కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ సందర్భంగా ‘బిగ్ బాస్’ ఫేమ్ శ్రీ సత్య చేతుల మీదగా ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ఆవిష్కరణ

May 25, 2026
వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

వైవిధ్యభరిత నటుడు రహ్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

May 23, 2026
మాస్  డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

May 22, 2026
ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

ఘనంగా”ఫస్ట్ టైం” సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరియు “ఈ పిల్ల నేను అనుకోనేలేదు” సాంగ్ లాంచ్

May 19, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In