• Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ
apvarthalu
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery
No Result
View All Result
apvarthalu
No Result
View All Result

రియల్ లైఫ్ ‘ఇస్మార్ట్ శంకర్’ను రెడీ చేస్తున్న ఎలన్ మస్క్

admin by admin
February 3, 2024
in movies
0 0
0
రియల్ లైఫ్ ‘ఇస్మార్ట్ శంకర్’ను రెడీ చేస్తున్న ఎలన్ మస్క్
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా డేరింగ్ & డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల రికార్డులు సృష్టించిందీ సినిమా. మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌లో ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీ మిళితం చేయడం పూరికి మాత్రమే చెల్లింది.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో హీరో రామ్ మెదడులో బ్రెయిన్ చిప్ ఇంప్లాంట్ చేస్తారు. అది సినిమా. దానిని నిజం చేయబోతున్నారు ఎలన్ మస్క్. ఆల్రెడీ రియల్ లైఫ్ ‘ఇస్మార్ శంకర్’ ఒకరిని రెడీ చేశారు. ఎర్లీ రిజల్ట్స్ పాజిటివ్ అని చెప్పారు.

ఎలన్ మస్క్ ఓ వ్యవస్థాపకుడిగా ఉన్న న్యూరోలింక్ కంపెనీ మనిషి మెదడులో ఒక వైర్ లెస్ చిప్ అమర్చింది. సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రయోగం అనంతరం మెదడు కార్యకలాపాలు గుర్తించామని, పేషెంట్ కోలుకున్నారని మస్క్ ట్వీట్ చేశారు. మన మెదడును కంప్యూటర్లకు కనెక్ట్ చేసి నరాల సంబంధిత సమస్యలను పరిష్కరించాలనేది తమ లక్ష్యం అని ఆయన చెప్పారు. క్లుప్తంగా చెప్పాలంటే… ఈ ప్రయోగం అంతటినీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో రామ్, పూరి జగన్నాథ్ చాలా చక్కగా వివరించారు.

‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్, పూరి నమ్మిన కథను ఎలన్ మస్క్ నిజం చేయడం, నిజ జీవితంలో ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం ఆసక్తికరంగా ఉంది కదూ! మనిషి మెదడులో చిప్ అమర్చడం అనేది కలలో కూడా ఊహించడానికి కష్టం అనే బ్రమ ఇన్నాళ్లు ఉండేది. ఇప్పుడు అది నిజం అయ్యింది. భవిష్యత్తులో ఇంకెన్ని ప్రయోగాలు వస్తాయో చూడాలి.

ఇప్పుడు హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు. ఆ సినిమా కథ కూడా ఫ్యూచరిస్టిక్ మెడికల్ టెక్నాలజీ మీద ఉంటుందని తెలిసింది. ఆ సినిమా విడుదల అయ్యాక దానిపై కూడా ఈ విధంగా ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ చేస్తున్న రామ్, పూరి జగన్నాథ్… త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
#iSmartShankar
#RamPothineni

Previous Post

బ్రహ్మనందం తొలి నేపాలి సినిమా… హ్రశ్వ దీర్ఘ రిలీజ్ ఎప్పుడంటే…?

Next Post

ప్రముఖ ఎ.ఎం.ఆర్ గ్రూప్ అధినేతకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుతో సత్కారం

Next Post
ప్రముఖ ఎ.ఎం.ఆర్ గ్రూప్ అధినేతకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుతో సత్కారం

ప్రముఖ ఎ.ఎం.ఆర్ గ్రూప్ అధినేతకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డుతో సత్కారం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్
movies

అనకాపల్లి… రా అండ్ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్

by admin
October 3, 2026
0

...

Read more
సీనియర్ దర్శకుడు  బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

సీనియర్ దర్శకుడు బి.నర్సింగ్ రావుకు గౌరవ డాక్టరేట్

October 3, 2026
‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

‘తెల్లకాగితం’ యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది

October 2, 2026
ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా  వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

ప్రముఖ నటుడు నాగమహేశ్ చేతుల మీదుగా వైభవంగా ‘వేల్’ సినిమా ట్రైలర్ లాంచ్

September 30, 2026
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న” మిస్ కాళికా మిస్సింగ్”

September 22, 2026
ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

ఖైరతాబాద్‌ మహా గణపతిని దర్శించుకుని పూజలు చేసిన వేదవ్యాస్‌ సినిమా టీమ్‌…

September 22, 2026
లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

లండన్ ఎంబీఏ టు పాన్ ఇండియా మూవీస్: అదరగొడుతున్న బ్యూటీ విత్ బ్రెయిన్స్ ‘ఆయుషి పటేల్’

September 16, 2026
ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్

September 10, 2026
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో 2000 మంది ఆడపడుచులకు సామూహిక శ్రీమంతం

September 8, 2026
  • Home
  • Movies
  • Politics
  • Reviews
  • Teasers
  • Trailers
  • Gallery

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

No Result
View All Result
  • Home
  • అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానికి చిరంజీవి అండ

© 2021 Apvarthalu.com || Designed By 10gminds

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In