సనాతన హైందవ ధర్మాన్ని బలంగా బాధ్యతగా చెప్తూ
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో విడుదలైన నాల్గవ చిత్రం ‘అఖండ–2’. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారు మరియు శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిలం స్వామివారు 400 మంది వేద పాఠశాల విధ్యార్థులతో కలిసి హైదరాబాద్‌లో అఖండ–2 సినిమాని శనివారం వీక్షించారు. బాలకృష్ణ రుద్రుడిగా చేసిన అఖండ తాండవాన్ని చూసిన తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీనుని ఆశీర్వదించి సన్మానించారు. సన్మానం తర్వాత శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారు మాట్లాడుతూ–‘‘ ఎంతో బాధ్యతతో కూడిన చిత్రాన్ని తీశారని మీరు తీసిన ఈ చిత్రం ద్వారా హైందవ ధర్మాన్ని అందరికి అర్థమయ్యేలాగా, బలంగా చెప్పారని దర్శకుడు బోయపాటి శ్రీను ని ప్రశంసించారు.










